దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన వైఎస్సార్

YSRCP Party Leaders Pays Tribute On YSR 11th Death Anniversary  - Sakshi

సాక్షి, నెల్లూరు : దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధికి ఎంతో కృషి చేశార‌ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాల‌యంలో వైఎస్సార్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులర్పించారు. కృష్ణపట్నం పోర్టుతో పాటు ప్రత్యేక ఆర్థిక మండలి కూడా వైఎస్సార్ చొరవ వల్లే వచ్చాయని, వీటితో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని కొనియాడారు. అనంత‌రం స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మొయిల్ల గౌరి స‌హా పార్టీ నేతలు పాల్గొన్నారు.

వైఎస్సార్ మాదిరిగానే వైఎస్ జ‌గ‌న్ 
ముఖ్యమంత్రిగా దివంగత మ‌హానేత డాక్టర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వైఎస్సార్ 11వ వ‌ర్థంతి సందర్భంగా నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్‌లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ ఆశ‌యాల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అమ‌లుచేస్తూ జ‌న‌రంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. వైఎస్సార్ హయాంలో మాదిరిగానే వైఎస్ జ‌గన్ పాల‌న‌లోనూ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. (అదే మహానేతకు ఇచ్చే నిజమైన నివాళి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top