గ్రహం అనుగ్రహం (19-09-2020)

Daily Horoscope In Telugu (19-09-2020) - Sakshi

గ్రహఫలం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు అధిక ఆశ్వయుజ మాసం, తిథి శు.విదియ ప.12.34 వరకు తదుపరి తదియ, నక్షత్రం హస్త ఉ.8.02 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం ప.3.24 నుంచి 4.54 వరకు దుర్ముహూర్తం ఉ.5.53 నుంచి 7.29 వరకు అమృతఘడియలు... రా.12.21 నుంచి 1.50 వరకు.

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.59
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

రాశిఫలం:
మేషం: వ్యవహారాలు సకాలంలో పూర్తి. కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. ఆరోగ్యం కాస్త కుదుటపడుతుంది. భూములు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: సన్నిహితులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం:ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆర్థికపరమైన సమస్యలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: కొత్త పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటుంది.

సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో ఆటంకాలు. దైవదర్శనాలు. వ్యాపారాల విస్తరణ నిలిపివేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కన్య: కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత రాణిస్తాయి.

తుల: బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఇంటాబయటా నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. ఆకస్మిక ధనలబ్ధి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు స్వీకరిస్తారు.

ధనుస్సు: అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మకరం: సన్నిహితులతో విభేదాలు. అర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రుల నుంచి విమర్శలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగొడిగా ఉంటాయి.

మీనం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top