గ్రహం అనుగ్రహం (20-09-2020)

Daily Horoscope In Telugu (20-09-2020) - Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, అధిక ఆశ్వయుజ మాసం, తిథి శు. తదియ ఉ.10.08 వరకు తదుపరి చవితి, నక్షత్రం చిత్త ఉ.6.21 వరకు తదుపరి స్వాతి తె.4.42 వరకు (తెల్లవారితే సోమవారం), వర్జ్యం ప.11.31 నుంచి 1.02 వరకు, దుర్ముహూర్తం సా.4.21 నుంచి 5.09 వరకు, అమృతఘడియలు... రా.8.27 నుంచి 9.44 వరకు.

సూర్యోదయం        :  5.52
సూర్యాస్తమయం    :  5.58
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

రాశిఫలాలు:

మేషం: ఆశ్చర్యకరమైనరీతిలో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. ప్రముఖులతో పరిచయాలు.  సన్నిహితుల సాయం అందుతుంది.  వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృషభం: మీ శ్రమకు  ఫలితం దక్కుతుంది. స్వల్ప అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా వ్యతిరేకత. యత్నకార్యసిద్ధి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.

మిథునం: పరిస్థితులు కొంత అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం: సన్నిహితులతో మనస్పర్ధలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. స్వల్ప అస్వస్థత. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి.

సింహం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు  కొంటారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. సన్నిహితులు ఒత్తిడులు పెంచుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

తుల: సోదరులు, సోదరీలతో సఖ్యత. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

వృశ్చికం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

ధనుస్సు: చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కొన్ని వివాదాలు తీరతాయి. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూలం.

కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

మీనం: సన్నిహితులతో మనస్పర్థలు. ఆలయాలు సందర్శనం. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.
 

 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top