గ్రహం అనుగ్రహం (21-08-2020)

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.తదియ రా.2.21 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఉత్తర రా.1.30 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.9.41 నుంచి 11.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు తదుపరి ప.12.27 నుంచి 1.19 వరకు, అమృతఘడియలు... సా.6.42 నుంచి 7.42 వరకు.
సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.20
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
దినఫలాలు
మేషం: వ్యవహారాలలో పురోగతి. ఆస్తి ఒప్పందాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. బంధువుల సలహాలు పాటిస్తారు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
వృషభం: పనుల్లో చికాకులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తుంది. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
మిథునం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. చర్చలలో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కర్కాటకం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కొత్త ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.
సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కన్య: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి.
తుల: వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.
వృశ్చికం: పలుకుబడి మరింత పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
ధనుస్సు: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభం. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు చాలావరకూ తగ్గుతాయి.
మకరం: మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహపూరితంగా ఉంటుంది.
కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. సోదరులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.
మీనం: రావలసిన బాకీలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తులు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి