వార ఫలాలు (సెప్టెంబర్‌ 20  నుంచి 26 వరకు)

Weekly Horoscope From September 20th To 26th 2020 - Sakshi

వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఇంతకాలం పడిన అవస్థలు, ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. మీ ఆలోచనలు అమలు చేసేందుకు యత్నిస్తారు. నూతన ఉద్యోగయోగం. ఆర్థికంగా కాస్త ఊరట లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు నెమ్మదిగా పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు తగ్గుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. తెలుపు, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పర్చినా అవసరాలకు లోటు ఉండదు. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీరంటే మిత్రులు మరింత ఇష్టపడతారు. భూముల రిజిస్ట్రేషన్లు వంటివి పూర్తి చేస్తారు. సంతానపరంగా శుభవార్తలు అందుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విస్తరించేందుకు ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు, సమస్యలు తీరతాయి. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీ అభివృద్ధిలో సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది. సోదరులు, మిత్రులతో విభేదాలు పరిష్కారంలో మీరే చొరవ చూపుతారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కాంట్రాక్టులు కొన్ని దక్కే అవకాశం. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలు, సమస్యలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పిలుపు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, బంగారు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆశించిన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆర్థిక విషయాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఊహించని రీతిలో ఒక వ్యక్తి ద్వారా ధనలాభం కలిగే సూచనలు. పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. కళారంగం వారికి ఒడిదుడుకులు కొంత తొలగుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. పసుపు, ఎరుపు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పరిస్థితులు చక్కబడతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగి ఊరట చెందుతారు. ఎదుటవారి సమస్యలు సైతం తీరే మార్గం సూచిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక రూపొందిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కష్టసాధ్యమనుకున్న విధుల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక డీలాపడతారు. ప్రయాణాలలో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి. సోదరులు, మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఖర్చులకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత నిదానిస్తాయి. కొంత వెనుకబాటు కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొంత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభించే అవకాశం. రాజకీయవర్గాలకు ఊహించని పిలుపు రావచ్చు. నేరేడు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం కొంత కుదుటపడి ఊరట లభిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి విషయాలు మరిన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. బంధువుల ద్వారా కొంత ధనలాభ సూచనలు. నిరుద్యోగుల దీర్ఘకాలిక కృషి ఫలిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో  మరింత ఆదరణ లభిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు నేర్పుగా పూర్తి చేస్తారు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. మిత్రులతో విభేదాలు. పసుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుని అవసరాలు తీరతాయి.  వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలకు మధ్యవర్తిత్వం వహిస్తారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో  కొత్త పెట్టుబడులు, లాభాలు అందుతాయి.  ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆశించినంత రాబడి దక్కి అవసరాలు తీరతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో విÔó ష కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని ఆత్మవిశ్వాసమే మీకు ఉపకరిస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. నేరేడు, బంగారు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులు ప్రారంభంలో నెమ్మదించినా క్రమేపీ పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు. వివాహయత్నాలలో ముందడుగు వేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులు కొంత ఊరట చెందే అవకాశాలున్నాయి. ఆలయాలు సందర్శిస్తారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. మీపై వ్యతిరేకత చూపే వారు కూడా స్నేహహస్తం అందించడం విశేషం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల వాతావరణం నెలకొంటుంది. పసుపు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీలక్ష్మీస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top