అసూయపడి.. ఉసురు తీసి 

Child Assassition Case Mystery Unraveled - Sakshi

వీడిన చిన్నారి హత్య కేసు మిస్టరీ

సోంపేట(శ్రీకాకుళం జిల్లా): అమ్మప్రేమ దక్కదన్న బాధో, వేరెవరికో వెళ్లిపోతుంద న్న ఆవేదనో గానీ ఆ బాలిక ఊ హించని నిర్ణయం తీసుకుంది. ఏకంగా హత్య చేయడానికే పూనుకుంది. రోజూ చూసే ముద్దుగారే పాపాయిని ట్యాంకులో పడేసి చంపేసేంత కోపం పెంచుకుంది. మండలంలోని టి.శాసనాం గ్రామంలో ఈ నెల 4న జరిగిన 11 నెలల చిన్నారి మూల హేమశ్రీ హత్య మిస్టరీని బారువ పోలీసులు ఛేదించారు. బారువ ఎస్‌ఐ పి.నారాయణస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలిక చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారిని పక్కింటి వారు తీసుకెళ్లడం, ఆ ఇంటి ట్యాంకులోనే పాప పడి మృతి చెందడంతో పోలీసులు అన్ని కో ణాల్లో దర్యాప్తు చేశారు. ఈ విచారణలో విస్మయం కలిగించే నిజాలు తెలిశాయి. 

హేమశ్రీని పక్కింటికి చెందిన నిర్మల అనే మ హిళ ప్రతి రోజూ ఆడించడానికి తనంటికి తీసుకెళ్లేవారు. పాపను ముద్దుగా చూసుకునేవారు. ఇది ఆ మె కూతురికి నచ్చలేదు. తన తల్లి ఆ చిన్నారిని దగ్గరకు చేర్చడం, ఆడించడం ఆమె చూసి తట్టుకోలేకపోయింది. తన అమ్మ తనకు దూరమవుతోందని భయపడింది. పదిహేనేళ్ల వయసు గల ఆ బాలిక హేమశ్రీపై విపరీతమైన కోపం పెంచుకుంది. అదీ కాక తను రోజూ ఫోన్‌లో మాట్లాడుతుంటే తల్లి మందలించేవారు. దీనికి కూడా హేమశ్రీనే కారణమని తప్పుగా భావించుకుంది. దీంతో సమయం చూసి పాపను ఇంటిపైన ఉన్న వాటర్‌ ట్యాంకులో పడేయడంతో చిన్నారి చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలిని బాల నేరస్తుల కోర్టుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top