కొల్లు రవీంద్రకు షరతులతో బెయిల్‌ 

Conditional Bail Granted To Kollu Ravindra - Sakshi

హత్య కేసులో నిందితుడిగా ఉన్న రవీంద్ర

చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కోర్టు న్యాయమూర్తి వై.లక్ష్మణరావు సోమవారం తీర్పు ఇచ్చారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత 28 రోజులపాటు విజయవాడ హోం క్వారంటైన్‌లో ఉండాలని, పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించకూడదని, కేసు గురించి ఎవరితోనూ చర్చించకూడదని న్యాయస్థానం షరతులు పెట్టింది. విచారణ అధికారికి కేసు విషయంలో పూర్తిగా సహకరించాలని, ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top