మనవడిని హత్య చేసిన తాత 

Grandfather Assassition Grandson - Sakshi

బేస్తవారిపేట (ప్రకాశం జిల్లా): వ్యసనాలకు బానిసైన మనవడిని తాత హత్య చేశాడు. ఈ సంఘటన బేస్తవారిపేట మండలంలోని ఖాజీపురంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. పూనూరు చిన్న వెంకటరెడ్డి, వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాఘవేంద్రరెడ్డి(20) గత మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రెవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆరు నెలల క్రితం సొంత గ్రామానికి వచ్చాడు. అయితే తరుచూ మద్యం  సేవిస్తూ, పేకాటాడుతూ నిత్యం డబ్బుల కోసం కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు. (చదవండి: నన్ను కాపాడి నువ్వెళ్లిపోయావా..)

ఈ క్రమంలో   డబ్బులు ఇవ్వాలని కుటుంబసభ్యులపై ఒత్తిడి ఎక్కువ చేశాడు. నా ఆస్తి వాటా పంచి ఇస్తే కారు కొనుక్కోని బాడుగకు తిప్పుకుంటానని, ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో పడుకుని ఉన్న సమయంలో రాఘవేంద్రరెడ్డి జేజీనాయన పూనూరు పెద్ద ఓసూరారెడ్డి రోకలిబండతో కొట్టి హతమార్చాడు. హత్య చేసిన అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న గిద్దలూరు సీఐ యు సుధాకరరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు  గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: విషాదం: వివాహమైన 28 రోజులకే..)  

అవాక్కైన గ్రామస్తులు.. 
ప్రతి కుటుంబంలో పిల్లలతో గొడవలు ఉంటాయి. అంతమాత్రానికే మనువడిని హత్య చేయడంపై గ్రామస్తులు విస్మయం చెందుతున్నారు. హత్య చేయడానికి వేరే కారణాలు ఏమైనా ఉండవచ్చునని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top