మొబైల్‌ చార్జర్‌ కేబుల్‌ మెడకు చుట్టి హత్య

Kolkata Lawyer Sentenced Life For Killing Husband With Mobile Charger - Sakshi

కోల్‌కతా: భర్తను చంపిన ఆరోపణలతో పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు, న్యాయవాది అనిందితా పాల్‌కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈమె తన భర్త రజత్‌ డేని మొబైల్‌ ఫోన్‌ చార్జర్‌ కేబుల్‌ని మెడకు చుట్టి చంపిన ఆరోపణలు నిరూపితమవడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. ఆమెకు భర్తను చంపినందుకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పదివేల రూపాయల జరీమానా చెల్లించాలని అడిషనల్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి సుజిత్‌ తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో సాక్ష్యాలను మాయం చేసినందుకు మరో ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top