బాలికను బెదిరించి 6 నెలలుగా..

సాక్షి, ప్రకాశం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై బెదిరింపులకు పాల్పడి ఆరు నెలలు అత్యాచారం చేస్తున్నాడో వ్యక్తి. ఈ సంఘటన సింగరాయకొండలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాత సింగరాయకొండ బాలిరెడ్డి నగర్‌కు చెందిన యుగందర్ అనే వ్యక్తి తన వద్ద పనిచేస్తున్న 15 సంవత్సరాల బాలికపై బెదిరింపులకు పాల్పడి గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ( పొద్దుపొద్దున్నే ఛేజింగ్, కాల్పులు )
ఈ నేపథ్యంలో బాలిక అనారోగ్యం పాలైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు యుగందర్, అతడి భార్యపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి