తుపాకీతో బెదిరించి రూ.కోటి లూటీ 

Person Looted 1Crore Amount By Trapping With Gun - Sakshi

యశవంతపుర : ఇద్దరు ముసుగు దొంగలు నగలను కొనడానికని వచ్చి నగల షాపులో భారీగా ఆభరణాలను దోచుకున్నారు. ఈ ఘటన ఐటీసిటీలో జాలహళ్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంఇఎస్‌ రోడ్డు బీఇఎల్‌ సర్కిల్‌ సమీపంలో వినోద్‌ బ్యాంకర్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అంగడి ఉంది. ఆదివారం ఉదయం యజమాని రాహుల్‌ జైన్‌ వచ్చి అంగడిని తెరిచాడు. ఇదే సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నగలు కావాలని షాపులోకి వచ్చారు. యజమాని కొన్ని గొలుసులను చూపించాడు.

టేబుల్‌ పై పెట్టగానే ఉంగరం చూపాలని అడిగారు. యజమాని ఉంగరం తేవటానికి లోనికి వెళ్లగా వెంబడించి పిస్టల్‌ను చూపించి కాళ్లు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కారు. అంగడిలోని సుమారు కోటి రూపాయిలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను దోచుకొని పరారయ్యారు. అతి కష్టం మీద రాహుల్‌ జైన్‌ కట్లు విడిపించుకొని వెళ్లి జాలహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాపు లోపల, బయట సీసీ కెమెరాల్లో రికార్డయిన చిత్రాలను పోలీసులు స్వాదీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నార 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top