వారఫలాలు (26 జూలై నుంచి 1 ఆగస్టు 2020)

Weekly Horoscope From July 26th To August 1st 2020 - Sakshi

వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఓర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాలను కొంతమేర  పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.  ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కళారంగం వారికి కొన్ని అవకాశాలు దక్కే ఛాన్స్‌. వారం చివరిలో అనారోగ్యం. దూరప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
అనూహ్యమైన రీతిలో వ్యవహారాలు పూర్తి కాగలవు. ఇంటాబయటా ఎదురుండదు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. మిత్రుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు మరింత ఉత్సాహం. ఆస్తి వ్యవహారాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు మారవచ్చు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు పరిశోధనలపై దృష్టిసారిస్తారు. చిన్ననాటి మిత్రుల ద్వారా ధనలాభ సూచనలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు ఉంటాయి. ఉద్యోగులు చిక్కుల నుంచి బయటపడతారు, అయితే కొన్ని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల వారు సమస్యల నుంచి గట్టెక్కుతారు.  వారం మధ్యలో భూవివాదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఇంటిలో శుభకార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు. ఆప్తుల నుంచి వస్తులాభాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘసేవలో పాలుపంచుకుంటారు. కొన్ని వివాదాల నుంచి అత్యంత నేర్పుగా  బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  వ్యాపారాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది.  విస్తరణపై దృష్టి పెడతారు. ఉద్యోగాలలో మీ సమర్థత చాటుకుంటారు. రాజకీయవర్గాలకు సమస్యలు కొన్ని తీరి ఊరట లభిస్తుంది. వారం మధ్యలో సోదరులతో వివాదాలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
చేపట్టిన కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కొన్ని నిర్ణయాలలో ఎటూ తేల్చుకోలేనిస్థితి. ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు కలసిరాక నిరాశ చెందుతారు. కొన్ని విషయాలలో శ్రమ వృథా కాగలదు. సహాయం పొందిన వారే సమస్యలు సృష్టించవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలలో ప్రతిష్ఠంభన. లాభాలు కూడా స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు తప్పవు. కళారంగం వారికి ఎంత శ్రమపడ్డా లాభం ఉండదు. వారం మధ్యలో  మిత్రుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
బంధువులు, మిత్రులతో రెట్టించిన ఉత్సాహంతో గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు. ఆర్థిక వ్యవహారాలు మరింత  సంతృప్తినిస్తాయి. అందరిలోనూ మీ నైపుణ్యాన్ని చాటుకుంటారు. వ్యాపారాలు లాభాల బాటలో పడతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు తొలగుతాయి. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని స్మరించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. జీవితాశయం నెరవేరి ఊరట చెందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయం. భూములు, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో ఆశించిన మేర లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు శ్రమ కొంతమేర ఫలిస్తుంది. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పరిచయాలు మరింత పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు.  విద్యార్థులకు ఒక కీలక సమాచారం రాగలదు. గృహ నిర్మాణయత్నాలలో కొంతమేర కదలికలు కనిపిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, మీ కష్టానికి ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు మరింత వేగంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. సన్నిహితుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో గందరగోళం తొలగుతుంది. ఉద్యోగాలలో చిక్కులు తొలగి సంతోషంగా గడుపుతారు. రాజకీయవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో  అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ధనప్రాప్తి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ఇంటి నిర్మాణయత్నాలు ప్రారంభించే వీలుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న సమయానికి విస్తరణ పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు, ఉన్నతాధికారుల ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండి, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీరు కోరుకున్న విధంగా మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు. అనుకోని ధనవ్యయం. నలుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు తగిన ప్రణాళిక రూపొందిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. పాతమిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూలమైన సమయం. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు చాలావరకు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
-సింహంభట్ల సుబ్బారావు
  జ్యోతిష్య పండితులు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top