ఒక్కరోజే 45 కోట్ల విరాళాలు!

Heavy Rains - Sakshi

గుంటూరు(మెడికల్‌), సెప్టెంబరు 7: ఉత్తర అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సం ఘం(జింకానా) రికార్డు సృష్టించింది. ఒక్కరోజే భారీస్థాయిలో రూ.45 కోట్ల విరాళాలు సేకరించి ఔరా అనిపించింది. అమెరికాలోని డల్లాస్‌ నగరంలో ఈ నెల 2 నుంచి 4 వరకు ‘జింకా నా 17వ రీ యూనియన్‌’ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్‌లో ఎంసీహెచ్‌ బ్లాక్‌ నిర్మా ణం కోసం విరాళాలు సేకరణ చేపట్టారు. జీఎంసీ పూర్వ విద్యార్థులు ఒకేరోజు రూ.45 కోట్లు(5.5 మిలియన్‌ డాలర్లు) సేకరించారు. ఫలితంగా గుంటూరు ప్రభుత్వ వైద్యబోధన ఆస్పత్రిలో తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆరు అంతస్తుల మాతా శిశు సంరక్షణ భవనం నిర్మాణానికి అవరోధాలు తొలగినట్లైంది. ఈ భవనం నిర్మాణానికి అవరమైన రూ.86 కోట్ల నిధులను తామే సమకూరుస్తామని జింకానా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ రవికుమా ర్‌ త్రిపురనేని ప్రకటించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా భారత్‌ బయోటెక్‌ ఫౌండర్‌ చైర్మన్‌ కృష్ణా ఎల్లా, నాట్కో ఫార్మా వైస్‌ ప్రెసిడెంట్‌ నన్నపనేని సదాశివరావు హాజరయ్యారు. డల్లా్‌సలో జరిగిన ఈ కార్యక్రమంలోనే రంగరాయ మెడికల్‌ కాలేజీ(కాకినాడ), సిద్ధార్థ మెడికల్‌ కళాశాల(విజయవాడ) పూర్వ విద్యార్థుల సమావేశాలు నిర్వహించారు. 

-- Adsolut 300x50 ----
-- end Adsolut ----
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

గమనిక : sakshi.comలో వచ్చే ప్రకటనలు అనేక దేశాలు, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుంచి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్తతో ఉత్పత్తులు లేదా సేవల గురించి విచారించి కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు/సేవల నాణ్యత, లోపాల విషయంలో సాక్షి యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top