అమెరికాలో కాల్పులు: 12 మంది మృతి

Gun Firing In US 12 People Deceased - Sakshi

వాష్టింగన్‌ : అగ్రరాజ్యం అమెరికా మరోసారి రక్తమోడింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. గుర్తు తెలియని దుండుగులు జరిపిన ఈ కాల్పుల్లో 12 మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. రోచెస్టర్‌లో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్టు గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం అర్థరాత్రి 12.30కు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే దేశంలో నల్లజాతీయులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా రోచెస్టర్‌లో అర్థరాత్రి వరకుఆందోళన కొనసాగాయి. ఈ ఆందోళన కొనసాగుతుండగానే కాల్పులు చెలరేగాయి. ఈ ఘటనలో పెద్ద ఎత్తున పౌరులు తీవ్ర గాయలపాలైయ్యారు. పౌరుల మృతిపై యావత్‌ అమెరికా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించం)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top