పెంపుడు సివంగులే ప్రాణం తీశాయి

South African Conservationist Assassinated By His Own White Lions - Sakshi

కేప్‌టౌన్‌ : పెంపుడు తెల్ల సివంగుల దాడిలో వాటి యజమాని మృతి చెందిన ఘటన దక్షిణాఫ్రికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ వన్యమృగాల సంరక్షకుడు వెస్ట్‌ మ్యాథ్యూసన్‌(65) సివంగులు పిల్లలుగా ఉన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా వాటిని పెంచుతున్నాడు. బుధవారం ఉదయం సివంగులతో కలిసి ఆయన మార్నింగ్‌ వాక్‌కు వెళ్లారు. వాకింగ్‌ చేస్తుండగా హఠాత్తుగా ఓ సివంగి ఆయనపై పడి దాడి చేయటం మొదలుపెట్టింది. అనంతరం మరో సివంగి కూడా దాడికి దిగింది. ( పులిని చంపి, కాళ్లు అపహరణ )

ఆ సమయంలో మ్యాథ్యూతో పాటు ఉన్న ఆయన భార్య సివంగుల నుంచి భర్తను రక్షించటానికి శతవిధాలా ప్రయత్నించింది. అయినప్పటికి లాభం లేకపోయింది. దీంతో పెంపుడు సివంగుల చేతిలోనే ఆయన ప్రాణం కోల్పోయారు. ఈ నేపథ్యంలో మ్యాథ్యూ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆ రెండు తెల్ల సివంగులను సంరక్షకుడి ఇంటినుంచి వేరే ప్రాంతానికి తరలించారు అధికారులు. వాటి భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. (రెండు పులులు కొట్లాట.. వీడియో వైరల్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top