వైరల్‌: పక్షిని నోట కరచుకున్న సాలీడు

Viral Video Huge Spider Eating A Bird Is Straight Up - Sakshi

ప్రకృతిలోని అద్భుతమైన ‘నిర్మాణాల్లో’ సాలెగూడు కూడా ఒకటి. ఆహారాన్ని సంపాదించుకునేందుకు సాలీడు పురుగులు దీనిని అల్లుకుంటాయి. ఇందులో చిక్కిన జీవి(సూక్ష్మజీవులు) ఏదైనా సరే విలవిల్లాడుతూ ప్రాణాలు విడవాలే తప్ప.. తప్పించుకోవడం అసాధ్యం. ఆహారం సంపాదించుకునేందుకు అంత పక్కాగా ప్లాన్‌ చేస్తాయి సాలీడులు. ఇక సాధారణంగా ఇప్పటి వరకు సాలీడులు చిన్న చిన్న జీవులను తినడం మాత్రమే మనం చూశాం. అయితే తరంతుల అనే జాతికి చెందిన ‘పింక్‌ టో తరంతుల’ అనే పెద్ద సాలీడు ఓ పక్షిని ముందరి కాళ్లతో బంధించి దానిని నోట కరచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘‘సాలీడు, పక్షిని తింటుందా. మా షెడ్లో కూడా సాలీడు గూళ్లు ఉన్నాయి. ఇకపై అక్కడికి వెళ్లను. ఇది చాలా భయంకరంగా ఉంది’’అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది) 

ఇక ఈ విషయం గురించి జాసన్‌ డన్‌లోప్‌ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘‘చెట్లపై నివసించే ఇలాంటి పెద్ద సాలీడులు సాధారణంగా చిన్న చిన్న పక్షులు, ఎలుకలను చంపి తింటాయి. అయితే ఎటువంటి ఆహారాన్నైనా సరే చప్పరించి, జ్యూస్‌లా మార్చుకుని తాగేస్తాయి. ఇక ఈ వీడియోలో ఉన్న పక్షి ఎముకలు, ఈకలు తప్ప ఇం​కేం మిగిలే అవకాశం లేదు’’అని చెప్పుకొచ్చారు. కాగా పింక్‌ టో తరంతుల సాలీడులు ఎక్కువగా దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top