బాడీషేమింగ్‌ అనేది మార్కెట్‌ గిమ్మిక్‌

Actress Bani J Special Interview In Sakshi Family

ప్రేక్షకులకు నచ్చినట్టుగా కాదు.. తన ఇష్టాన్ని ప్రేక్షకులు మెచ్చేట్టుగా చేసుకున్న నటి బానీ జె. కండలు తేలిన శరీరం, పోతపోసుకున్న టాటూల ఆకృతికి అభినయాన్ని జోడించి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.. స్టీరియో టైప్‌ను బ్రేక్‌ చేసింది.  

  • సొంతూరు  చండీగఢ్‌. తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు గుర్బానీ. ఇంటి పేరు జడ్జ్‌. వెరసి గుర్బాని జడ్జ్‌. కాని ఎమ్‌టీవీ వీడియో జాకీగా పనిచేస్తున్నప్పుడు వీజే బానీగా పాపులర్‌ అయ్యింది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో ‘బానీ జె’గా టైటిల్‌ కార్డ్‌ పడుతోంది. కాబట్టి అభిమానులు అందరూ బానీ జె అనే పిలుస్తున్నారు. 
  • తల్లి తాన్యా జడ్జ్‌ సంరక్షణలో పెరిగింది బానీ జె... అక్క సనేయాతోపాటు. ముస్సోరీలోని వుడ్‌ స్టాక్‌ స్కూల్లో చదువుకుంది. గ్రాఫిక్‌ డిజైనింగ్‌లో డిగ్రీ తీసుకుంది. 
  • గమ్యం తెలియకుండానే ముంబై చేరింది. ఎమ్‌టీవీ రియాలిటీ షో ‘ఎమ్‌టీవీ రోడీస్‌’ పాల్గొంది. రన్నరప్‌గా నిలిచి అదే షోకి హోస్ట్‌గా ఎంపికై ఆ ‘షో’ తర్వాతి ఆరు సీజన్లను నడిపించింది. ఆ చానెల్‌కే చెందిన క్యాంపస్‌ డైరీస్, ఎమ్‌టీవీ అన్‌ప్లగ్డ్‌ మొదలైన రియాలిటీ షోస్‌కూ  వీడియో జాకీగా వ్యవహరించింది. 
  • బిగ్‌బాస్‌నూ పలకరించింది.. పదవ సీజన్‌లో. ఇందులోనూ రన్నరప్‌గా నిలబడింది. 
  • 2007లో సినిమా ఎంట్రీ ఇచ్చింది... ‘ఆప్‌ కా సురూర్‌’తో. తెలుగు తెరకూ బానీ జె పరిచయమే 2016లో వచ్చిన ‘తిక్క’ అనే సినిమాతో. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లోనూ కనిపించింది. 
  • ‘ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌’తో బానీ జె వెబ్‌ సిరీస్‌ వీక్షకులకూ ఫేవరేట్‌ యాక్టర్‌  అయింది. అందులో ఫిట్‌నెస్‌ ట్రైనర్, లెస్బియన్‌..  ఉమన్‌ సింగ్‌ పాత్రలో నటించి తన నటనకే కాదు బోలెడంత ధైర్యానికీ అశేష వీక్షకాదరణను సొంతం చేసుకుంది. ఆ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌లోనూ ఆ ఆదరణ కొనసాగింది. 
  • ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం పెడుతుంది. ఖాళీ సమయాల్లో ఆమె గడిపేది జిమ్‌లోనే. ఫిట్‌నెస్‌ మోడల్‌ కూడా. ప్రయాణాలూ ఇష్టమే. 
  • కండలు తిరిగిన తన శరీరంతో చాలాసార్లు బాడీషేమింగ్‌కు గురైంది బానీ జె. ఆ కామెంట్స్‌నెప్పుడూ ఖాతరు చేయలేదు. ‘బాడీషేమింగ్‌ అనేది మార్కెట్‌ గిమ్మిక్‌. మెరుస్తున్న చర్మంతో ఆడవాళ్లు సున్నితంగా, నాజూగ్గా ఉండాలి అనే భావనను జనాల మెదళ్లలో  స్థిరం చేస్తుంది. ఈ గిమ్మిక్‌ మీడియాకు తెలియనిది కాదు. అయినా అందులో భాగం అవుతోంది’ అంటుంది బానీ జె కాస్త ఘాటుగానే. 

కాంట్రవర్సీ

  • ప్రముఖ హెయిర్‌ స్టయిలిస్ట్‌ సప్నా భవ్నానీని తను ముద్దు పెట్టుకుంటూ తీసుకున్న వీడియో సోషల్‌ మీడియాలో దుమారం రేపింది. దాంతో వెంటనే ఆ వీడియోను డిలీట్‌ చేసి విమర్శలను ఆఫ్‌లైన్‌లోకి తోసింది బానీ జె.  
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top