శర్వాకు జోడీగా...

Aishwarya Rajesh Upcoming Movie To Pair With Sharwanand - Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’తో సంచలన విజయం అందుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. తన తదుపరి చిత్రం ‘మహాసముద్రం’ని శర్వానంద్‌ హీరోగా చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ నిర్మించనుంది. ఇందులో శర్వాకు జోడీగా ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తారని సమాచారం. ‘కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు ఐశ్వర్య. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరో కూడా నటించే అవకాశం ఉందని టాక్‌. ప్రస్తుతం శర్వానంద్‌ ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top