తదుపరి చిత్రం కోసం కండలు పెంచుతున్న అఖిల్‌

Akhil Akkineni Undergoing Physical Transformation For His Next Movie - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హీరో అఖిల్ తన తదుపరి చిత్రంలో న్యూలుక్‌ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ట్రెనర్‌ సమీపంలో వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తున్న ఫొటోతో పాటు స్లీవ్‌లెస్‌లో టీషర్ట్‌తో కండలు తిరిగిన ఉన్న ఫొటోలను మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ ఫొటోలకు “ఇది నా ఆటను పూర్తి చేసే సమయం. కృషి. పట్టుదలతో చాలా ప్రత్యేకంగా ప్రారంభమైంది. స్వయంగా నన్ను నేను మార్చుకున్న. త్వరలో ఇంకా మరిన్ని రాబోతున్నాయి’ అంటూ # BeingTheBestVersionOfMyself. అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేసి షేర్‌ చేశాడు. అంతేగాక తన ఫొటోల్లో ఇది ఉత్తమ వెర్షన్‌ అని కూడా అఖిల్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం అఖిల్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్‌ సరసన పూజా హెగ్దే నటిస్తుంది.

ఇటీవల సెట్స్‌లోకి వెళ్లిన ఈ చిత్రం షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యునిట్‌ తెలిపింది. అయితే అఖిల్‌ ఈ సినిమా షూటింగ్‌ అనంతరం సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని గురించి ఇంతవరకు అఖిల్, కాని డైరెక్టర్‌ కానీ‌ అధికారంగా ప్రకటించలేదు. అయితే ఈ సినిమా షూటింగ్‌ మాత్రం వచ్చే ఏడాది సెట్స్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే  చిత్ర యూనిట్‌ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top