ఏంజెలినా విడాకుల కేసు: ఆ లాయర్‌ను తొలగించండి

Angelina Seeks Removal Of Private Judge In Her Divorce Case - Sakshi

లాస్‌ ఏంజిల్స్‌:  తన విడాకుల కేసును పర్యవేక్షిస్తున్న మాజీ భర్త బ్రాడ్‌ పిట్‌ ప్రైవేటు న్యాయవాది జాన్‌ డబ్ల్యూ అవుడర్‌కిర్క్‌ను ఈ కేసు నుంచి తొలగించాలని హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఏంజెలినా జోలి కోర్టును కోరారు. ఏంజెలినా తన భర్త  బ్రాడ్‌ పిట్‌ నుంచి విడాకులు కోరుతూ 2016లో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన మాజీ భర్త వ్యాపార సంబంధాల గురించిన సమాచారం ఇవ్వడంలో జాన్‌ విఫమలమయ్యాడని, తన న్యాయవాదులకు సహకరించడం లేనందున అతడు ఈ కేసు విచారణకు అనర్హుడని ఏంజెలినా కోర్టుకు తెలిపారు. (చదవండి: మాజీ భర్త సినిమాకు నో​ చెప్పిన హీరోయిన్‌)

లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో 2016లో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని మొదట్లో  జాన్‌ వాదించాడని ఏంజెలినా తెలిపారు. ఎందుకంటే జాన్‌ ఇతర కేసులతో నటులు అన్నే సి కిలేతో సంబంధం ఉందని, ఆ కేసులు తన నుంచి వెళ్లిపోతాయని భయపడినట్లు ఆమె ఆరోపించారు. తమ విడాకుల కేసుల విచారణ సమయంలో ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రత్యర్థి కేసు వ్యతిరేకతపై తన  నియమాకాన్ని(ఫీజులు స్వీకరించే సామర్థ్యాన్ని) ఉన్నత స్థాయిలో కూడా విస్తరించాలని జాన్‌ చూసినట్లు ఆమె చెప్పారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top