దివి ధ్యాస‌లో వంట‌ చేసిన మాస్ట‌ర్‌

Bigg Boss 4 Telugu: Amma Rajasekhar Flirting Divi Vadthya - Sakshi

మొన్న‌టివ‌ర‌కు దివి హౌస్‌లో ఉందా? లేదా అని భూత‌ద్దం వేసి మ‌రీ వెతికారు. ఒక్క‌సారి నోరు విప్పి మాట్లాడంటూ సోష‌ల్ మీడియాలో శ‌త‌కోటి దండాలు పెట్టారు. మ‌రికొంద‌రు మీమ్స్‌తో దివిపై లెక్క‌లేన‌న్ని సెటైర్లు వేశారు. దివి మాట్లాడ‌క‌పోతే నెట్టింట ప్ర‌ళ‌యం వ‌చ్చేలా ఉంద‌ని భావించిన‌ బిగ్‌బాస్ ప్రేక్ష‌కుల విన‌తికి అంగీకారం తెలిపాడు. దివిని మాట్లాడించేందుకు స్పెష‌ల్ టాస్క్ ఇచ్చాడు. అది కూడా ఇంటి స‌భ్యుల్లో ఎలాంటి మార్పు ఉండాల‌ని కోరుకుంటున్నావో చెప్పాల‌న్నాడు. దివి ఏమాత్రం తొణ‌క్కుండా ప్ర‌తి ఒక్క‌రి గురించి స్ప‌ష్టంగా వివ‌ర‌ణ ఇచ్చింది. దివిలో ఉన్న ఈ టాలెంట్‌కు అటు ఇంటిస‌భ్యుల‌తోపాటు ప్రేక్ష‌కులు కూడా ఖంగు తిన్నారు. (చ‌ద‌వండి: గంగ‌వ్వ 10 వారాల పైనే ఉంటుంది)

ఆమె చెప్పిన‌ పాయింట్లు విన్న త‌ర్వాత ప్రేక్ష‌కుల్లో దివికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అటు ఇంటి స‌భ్యులు కూడా ఆమెతో క‌లిసిపోవ‌డం మొద‌లుపెట్టారు. ముఖ్యంగా సూర్య కిర‌ణ్‌, మ‌రీ ముఖ్యంగా అమ్మ రాజ‌శేఖ‌ర్ ఆమెతో క్లోజ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అమ్మ రాజశేఖ‌ర్ దివిపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించాడు. "మంచి క్యారెక్ట‌ర్‌, అందం ఉంది, మ‌నంద‌రితో బిగ్‌బాస్‌లో ఉంది. నువ్వు హీరోయిన్‌, నేను హీరో.. స‌రేనా" అని క‌బుర్లు చెప్పాడు. త‌న‌కు నిజంగా వంట చేసే అబ్బాయిలంటే ఇష్ట‌మ‌ని దివి కూడా చెప్పుకొచ్చింది దీంతో ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతూ మురిసిపోయిన‌ మాస్ట‌ర్ పొర‌పాటున కూర‌లో టీ పొడి వేసి వంట‌ను నాశ‌నం చేశాడు. ఏదేమైనా ఒక్క ఎపిసోడ్‌తో ప్రేక్ష‌కుల్లో దివిపై ఉన్న అభిప్రాయమే మారిపోయింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఎట్ట‌కేల‌కు దివి మాట్లాడింది!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top