బిగ్‌బాస్: ఇవాళంతా పులిహోర ఎపిసోడే..

Bigg Boss 4 Telugu: Bigg Boss TV Skit Filled With Full Of Entertainment - Sakshi

షో ప్రారంభ‌మైన వారం రోజుల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు‌ బిగ్‌బాస్ నిద్ర లేచిన‌ట్టున్నాడు. ఇప్పుడిప్పుడే ఆట మొద‌లెట్టిన‌ట్టు క‌న్పిస్తున్నాడు. ఈ రోజు అదిరిపోయే ఎంట‌ర్‌టైన్మెంట్‌తో హౌస్‌మేట్స్‌ అద‌రగొట్టేశారు అంటూ ప్రోమోల మీద ప్రోమోలు వ‌దులుతున్నాడు. అయితే పులిలా చూపించే ప్రోమోలు ఎపిసోడ్ వ‌ర‌కు వ‌చ్చేస‌రికి పిల్లిలా మారిపోతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీంతో నిజంగా నేటి ఎపిసోడ్‌లో ఫుల్ డోసులో వినోదం ఉంటుందా? లేదా? అని చాలామంది సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన ప్రోమోలు ఈసారి ఎవరి అంచ‌నాలను వ‌మ్ము చేయ‌వ‌ని రుజువు చేస్తున్నాయి. ఇన్ని రోజులుగా ఒక్క క్లిప్పింగ్ కూడా దొర‌క‌ని మెహ‌బూబ్ దిల్‌సే ఏకంగా వ‌న్‌డే ఎపిసోడ్‌తో పాపుల‌ర్ అయిన‌ దివిని ఎత్తుకునే ఛాన్స్ కొట్టేశాడు. ఒక్క‌మ్మాయిని కూడా వ‌ద‌ల‌ట్లేదంటూ ఓ వైపు కుళ్లుకుంటూనే అమ్మ రాజ‌శేఖ‌ర్..‌ ఓసారి క‌ళ్యానిని ఎత్తుకుని చూపించ‌రా అని స‌వాలు విసిరాడు. దీంతో మెహ‌బూబ్‌.. 'వామ్మో, నావ‌ల్ల కాదు బాబోయ్' అంటూ దండం పెట్టి మ‌రీ అక్క‌డ నుంచి పారిపోయాడు.

(చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: సూర్య‌కిర‌ణ్ అవుట్, ఆమెపై బిగ్‌బాంబ్‌!)

చీపురు దెబ్బ‌లు తిన్న సోహైల్‌
ఆ త‌ర్వాత స్కిట్‌లో క‌‌ళ్యాణి గొంతు స‌వ‌రించుకుని పాటందుకోవ‌డంతో అక్క‌డున్న మాస్ట‌ర్ చచ్చాన్రా దేవుడా అని ఏడ్వ‌లేక న‌వ్వేశాడు. దేత్త‌డి హారిక ఇన్నాళ్ల‌కు తెలంగాణ యాస‌లో మాట్లాడ‌టం విశేషం. దేవి నాగ‌వ‌ల్లి న‌ట‌న మాత్రం ఎపిసోడ్‌కే హైలెట్‌గా నిలిచేలా ఉంది. ఇక దివి త‌న‌కు పులిహోర ఇష్ట‌మ‌ని మొహ‌మాటం లేకుండా ముఖం మీదే చెప్పింది. కానీ అఖిల్ అదేంటో తెలీని అమాయ‌కుడిలా ఎక్స్‌ప్రెష‌న్స్ ఇవ్వ‌డంతో దివి.. అది కూడా తెలీదా? అన్న‌ట్లుగా ఓ లుక్ ఇచ్చింది. అటు సోహైల్ మ‌రీ దారుణంగా ఆడ‌వాళ్ల చేతిలో చీపురు దెబ్బ‌లు తిని ప‌రువు పోగొట్టుకుంటున్నాడు. ప్రోమోను చూస్తుంటే ఈ ఎపిసోడ్‌లో అబ్బాయిల క‌న్నా ఆడ‌వాళ్ల ప‌ర్మాఫెన్సే అదుర్స్ అన్న‌ట్లు క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీళ్లే)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top