రొమాంటిక్ డ్యాన్స్‌; క‌ళ్లు మూసుకున్న అరియానా

Bigg Boss 4 Telugu: Devi Nagavalli Comedy Punch In Skit - Sakshi

అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన‌ బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్.. మొద‌టి వారం నీర‌సంగానే సాగింది. హౌస్‌లో కోపానికి చిరునామాగా మారిపోయిన సూర్య‌కిర‌ణ్ ఎలిమినేట్ కావ‌డంతో హౌస్‌లో కాస్త ప్ర‌శాంత‌త చోటు చేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. కానీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా వ‌చ్చిన సాయి కుమార్ కాస్త త‌త్త‌ర‌పాటుకు లోన‌వుతున్న‌ట్లుగా ఉంది. దీంతో హౌస్‌లో అడుగు పెట్టిన త‌ర్వాత రోజే నామినేట్ అయ్యాడు. ఇదిలా వుంటే బిగ్‌బాస్ హౌస్‌లో ఇన్నాళ్ల‌కు గొడ‌వలు ప‌క్క‌న‌పెట్టి కాస్త వినోదాన్ని పంచుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: నేను చనిపోయాననుకున్నారు: సూర్యకిరణ్‌.)

ఈ మేర‌కు స్టార్ మా తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో నోయ‌ల్.. కుళ్లు జోకుల‌తో కామెడీ పండించే అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను రొమాంటిక్ డ్యాన్స్ చేయమ‌‌న్నాడు. అది కూడా అతిగా ఆవేశ‌ప‌డే క‌రాటే క‌ల్యాణితో. ఇంకేముంది.. ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు స‌రిపోయారు. వామ్మో, ఈ ఘోరాన్ని చూడ‌లేను అన్న‌ట్లుగా అరియానా క‌ళ్లు మూసేసుకుంది. మ‌రోవైపు మాస్ట‌ర్‌ కళ్యాణి చేయి ప‌ట్టుకుని లేప‌బోయి అత‌డే బొక్క బోర్లా ప‌డ్డాడు. దీంతో కంటెస్టెంట్లు అంద‌రూ ప‌గ‌లబ‌డి న‌వ్వ‌లేక చ‌చ్చారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఊర‌మాస్ స్టెప్పులేసిన దేవి)

మ‌రోవైపు ఉదయం రిలీజ్ చేసిన ప్రోమోలో కంటెస్టెంట్లు స‌రికొత్త అవ‌తారాల‌తో ద‌ర్శ‌న‌మిచ్చారు. దేత్త‌డి హారిక ఐట‌మ్ సాంగ్‌తో రెచ్చిపోనున్న‌ట్లు క‌నిపిస్తోంది. రోజుకో టాలెంట్‌ను బ‌య‌ట‌పెడ్తూ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న దేవి నాగ‌వ‌ల్లి.. "అబ్బాయి చూడ‌టానికి అలా ఉన్నాడు. కానీ, పేప‌రు మీద అమ్మాయి అని పేరున్నా వద‌ల‌డు" అంటూ నేటి ఎపిసోడ్‌లో కామెడీ పంచ్‌లు విసురుతోంది. వీరి స్కిట్‌లు నేడు ఏ మేర‌కు పేలుతాయో చూడాలి. (చ‌ద‌వండి: జిగిరీ దోస్త్ నోయ‌ల్‌కే స‌పోర్ట్: రాహుల్)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top