బిగ్‌బాస్‌: ఊర‌మాస్ స్టెప్పులేసిన దేవి

Bigg Boss 4 Telugu: Divi Vadthya, Devi Nagavalli Mass Performance - Sakshi

బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో నేడు ఎన్నో అద్భుతాలు జ‌ర‌గ‌నున్నాయి. సైలెంట్‌గా ఉండే దివి డ్యాన్స్ చేయ‌డం, జ‌ర్న‌లిస్టు దేవి కూడా స్టెప్పులేసి అద‌ర‌గొట్ట‌డంతో ఇంటి స‌భ్యులు నోరెళ్ల‌బెట్టారు. ప్రేక్ష‌కులైతే ఇది క‌లా? నిజ‌మా? అని సంభ్ర‌మాశ్చ‌ర్యంలో మునిగి తేలుతున్నారు. అయితే నిజంగానే నాగ్ సండేను ఫండేగా మార్చేందుకు సంసిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఆట‌పాట‌ల‌తో అదుర్స్ అనిపించేందుకు అటు కంటెస్టెంట్లు కూడా ఫుల్ రెడీ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. ఆ వెంట‌నే ఒక‌ర్ని ఇంటి నుంచి పంపించ‌డం, మ‌రొక‌రిని ఇంట్లోకి ఆహ్వానించ‌డం కూడా జ‌ర‌గ‌నుంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ ఎంట్రీపై స్పందించిన హీరోయిన్‌)

కంటెస్టెంట్ల‌కు నిన్న కాస్త చీవాట్లు పెట్టిన నాగ్ నేడు వారితో ఆట‌లాడించ‌నున్నాడు. అందులో భాగంగా ఇంటి స‌భ్యుల‌కు డ్యాన్స్ కాంపిటీష‌న్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. అబ్బాయిలంద‌రూ బాగానే డ్యాన్స్ చేశారు. కానీ అమ్మాయిలు మాత్రం ఊహ‌కంద‌ని స్థాయిలో ఊర మాస్ స్టెప్పులేశారు. దివి అయితే మైండ్ బ్లాక్ అంటూ దిమ్మ‌దిరిగిపోయేలా డ్యాన్స్ చేసింది. అంత‌కు మించి అనేట్టుగా దేవి నాగ‌వల్లి సిటీమార్ పాట‌కు త‌న స్టెప్పుల‌తో స్టేజీని ద‌ద్ద‌రిల్లించేసింది. (చ‌ద‌వండి: వైల్డ్ కార్డ్ ఎంట్రీ: ఇద్దరా? ముగ్గురా?)

దేవిని మెచ్చున్న నాగార్జున‌
బ్రేకింగ్ న్యూస్‌, వివాదాస్ప‌ద ఇంట‌ర్వ్యూల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉన్న దేవిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని నెటిజ‌న్లు తెగ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కాగా బిగ్‌బాస్ మీలో క‌ట్ట‌ప్ప ఉన్నార‌న‌గానే ఇంటి స‌భ్యుల మ‌న‌సుల్లో భ‌యం, అనుమానం బ‌లంగా నాటుకుపోయింది. ప్ర‌తి చిన్న‌దానికి కూడా మిగ‌తావారిపై అనుమానంగా చూడ‌టం మొద‌లు పెట్టారు. కానీ దేవి మాత్రం అస‌లు క‌ట్ట‌ప్పే లేరు అని తేల్చి చెప్పింది. త‌ర్వాత ఇదే విష‌యాన్ని నాగ్ వెల్ల‌డిస్తూ.. ఆమె తెలివి, ముందుచూపును మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోయారు. ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే త‌త్వం, ముందుచూపు ప్ర‌ద‌ర్శించే నైపుణ్యంతో‌ దేవిపై ప్రేక్ష‌కుల్లో కాస్త అభిమానం డోసు పెరిగింది. దేవి చాలా స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తుందంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. (చ‌ద‌వండి: సూర్య‌కిర‌ణ్‌కు మొట్టికాయ‌లు వేసిన నాగ్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top