బిగ్‌బాస్‌: ఎలిమినేష‌న్, ఆ వెంట‌నే స‌ర్‌ప్రైజ్‌

Bigg Boss 4 Telugu: First Wild Card Entry - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ మొద‌టి వారం ఎలిమినేష‌న్ స్టార్ట్ అయింది. ఎలిమినేష‌న్ జోన్‌లో ఉన్న ఏడుగురిలో కింగ్ నాగార్జున ఇప్ప‌టికే గంగ‌వ్వ‌, అభిజిత్‌, సుజాత‌ను సేవ్ చేశారు. మెహ‌బూబ్‌, అఖిల్‌, దివి ఇంకా డేంజ‌ర్ జోన్‌లోనే ఉన్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు అందించిన స‌మాచారం ప్రకారం ద‌ర్శ‌కుడు సూర్య కిరణ్‌ హౌస్ నుంచి బ్యాగు స‌ర్దు‌కుని బ‌య‌ట‌కు వెళ్ల‌నున్నాడ‌ని భోగ‌ట్టా. ఇదిలా వుంటే ఎలిమినేష‌న్ వ‌ద్దంటూ ఇంటి స‌భ్యులు ర్యాప్ సాంగ్‌తో నాగార్జున‌ను అభ్య‌ర్థించారు. కానీ బిగ్‌బాస్.. సీత‌య్య, ఎవ‌రిమాటా విన‌డ‌ని వారి విన‌తిని తిర‌స్క‌రించారు. దీంతో నామినేట్ అయిన కంటెస్టెంట్లు ఒక్క‌సారిగా డీలా ప‌డిపోయారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వీరే‌!)

న‌టుడి వైల్డ్ కార్డ్ ఎంట్రీ
కాగా షో ప్రారంభ‌మై వారం రోజులు కావ‌స్తున్నా ఆ సంద‌డి, హ‌డావుడి లేద‌ని, చ‌ప్ప‌గా సాగుతుంద‌ని ప్రేక్ష‌కులు పెద‌వి విరుస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ నిర్వాహ‌కులు వైల్డ్ కార్డ్ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు. ఈ మేర‌కు నేటి ఎపిసోడ్‌లో నాగ్‌ ఓ స‌ర్‌ప్రైజ్ ఉండ‌బోతోందని చెప్పారు. ఆ వెంట‌నే ఓ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటును లోప‌లికి పంపిచారు. ఆ కంటెస్టెంటు న‌టుడు సాయి కుమార్ పంప‌న అని స‌మాచారం. "ఈ రోజుల్లో" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయి కుమార్ "బ‌స్టాప్" వంటి ప‌లు సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ పెద్ద బ్రేక్ అయితే రాలేదు. దీంతో బిగ్‌బాస్ షో ద్వారా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు. మ‌రి ఆయ‌న‌కు బిగ్‌బాస్ ఎంత‌మేర‌కు క‌లిసివ‌స్తుందో చూడాలి! (చ‌ద‌వండి: ఎన్నో వారాలు ఉండ‌లేను: గ‌ంగ‌వ్వ‌)

డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టిన‌ దివి, దేవి
మ‌రోవైపు ఉద‌యం స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోలో కంటెస్టెంట్లు అంద‌రూ డ్యాన్సుల‌తో ర‌చ్చ రచ్చ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ముఖ్యంగా దివి, దేవి చేసిన స్టెప్పులు ప్రేక్ష‌కుల‌ను ఈలలు వేయించేలా ఉన్నాయి. ఆఖ‌రుకు గంగ‌వ్వ కూడా హుషారుగా స్టెప్పులేయ‌డం విశేషం. క‌ల్యాణి పాట అందుకోవ‌డంతో త‌ప్పించుకునే ఛాన్స్ లేక ఇంటి స‌భ్యులంద‌రూ బిక్క‌ముఖం వేసుకున్నారు. (చ‌ద‌వండి: గంగ‌వ్వ 10 వారాల పైనే ఉంటుంది)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top