హీరో- జీరో గేమ్‌తో విల‌న్‌గా మారిన లాస్య‌

Bigg Boss 4 Telugu: Lasya Says Sorry To Amma Rajasekhar - Sakshi

బిగ్‌బాస్ షోలో నిన్న‌టి ఎపిసోడ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. అస‌లే నిన్న ఐపీఎల్ ప్రారంభం కావ‌డంతో చాలామంది ప్రేక్ష‌కులు బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. కానీ అనూహ్యంగా బిగ్‌బాస్ గేమ్ మార్చాడు. డ‌బుల్ ఎలిమినేష‌న్ అంటూ అంద‌రిలో ఆస‌క్తి రేపాడు. మ‌రోవైపు హీరో-జీరో గేమ్‌లో శ్రుతి మించిన కామెడీ అని లాస్య.. అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను జీరోగా పేర్కొంది. అక్క‌డితో ఆగ‌కుండా ఓ ఫొటో షూట్ కోసం దివి ప్రెగ్నెంట్‌గా క‌నిపించేందుకు రాజ‌శేఖ‌ర్ స్వ‌యంగా ఆమెకు పిల్లో స‌ర్ద‌డం త‌న‌కు క‌రెక్ట్ అనిపించ‌లేద‌ని చెప్పుకొచ్చింది  దివి ప‌ట్ల ఆయ‌న‌ అలా ప్ర‌వ‌ర్తించాల్సింది కాద‌ని చెప్ప‌డంతో మాస్ట‌ర్ త‌ట్టుకోలేక‌పోయాడు. త‌న‌కు ఎలాంటి ఉద్దేశం లేద‌ని, అది టాస్క్ కోసం హ‌డావుడిలో చేశాన‌ని చెప్పుకుంటూ ఏడ్చేశాడు. (బిగ్‌బాస్ నాకు సారీ చెప్పాలి: నోయ‌ల్)

త‌న వ‌ల్ల ఏడ్చినందుకు బాధ‌ప‌డ్డ‌ లాస్య అత‌డి కాళ్లు మొక్కి మ‌రీ క్ష‌మించ‌మ‌ని కోరింది. అయిన‌ప్ప‌టికీ హౌస్‌లో వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కిందే కానీ చ‌ల్ల‌బ‌డ‌లేదు. పైగా లాస్య త‌న పేరును ప్ర‌స్తావిస్తూ చేసిన‌ కామెంట్స్‌ను దివి జీర్ణించుకోలేక‌పోయింది. 'ఆ విష‌యంలో నాకెలాంటి అభ్యంత‌రం లేదు, మ‌ధ్య‌లో నీకెందుకు, ష‌ట‌ప్' అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. దివి యాటిట్యూడ్ చూసి షాకైన లాస్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే మాస్ట‌ర్ ఏడ్వ‌టంతో ఇంటి స‌భ్యులంద‌రూ అత‌డిని ఓదార్చ‌ట‌మే కాక‌, చాలామంది మాస్ట‌ర్‌నే హీరోగా ప్ర‌క‌టించారు. ఈ ఒక్క స‌న్నివేశంతో లాస్య విల‌న్‌గా మారిపోయింది. (బిగ్‌బాస్ పిచ్చి కామెడీ దారిలో వెళుతుంది: దేవి ఫైర్‌)

కాగా దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. లాస్య త‌నకు అనిపించింది చెప్పార‌ని, అయినా ఎవరి అభిప్రాయాలు వారికుంటాయంటూ ఆమెను వెన‌కేసుకొస్తున్నారు. దీన్ని మాస్ట‌ర్ పాజిటివ్‌గా తీసుకుంటే అస‌లు ఏ స‌మ‌స్యా ఉండేది కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. దివి నోరు జార‌డాన్ని సైతం విమ‌ర్శిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం మాస్ట‌ర్ ఇమేజ్‌ను దెబ్బ‌తీసేందుకే లాస్య అలాంటి కామెంట్స్ చేసింద‌ని మండిప‌డుతున్నారు. దివికే అభ్యంత‌రం లేన‌ప్పుడు మ‌ధ్య‌లో ఆవిడ‌కేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఏదైతేనేం, నిన్న ఒక్క ఎపిసోడ్‌ హౌస్‌లో కార్చిచ్చును రాజేసింది. (ఇంటి స‌భ్యుల‌కు బిగ్‌బాస్ ప‌నిష్మెంట్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top