నీ ఆట నువ్వాడుకో: నోయ‌ల్‌పై నాగ్ ఫైర్‌

Bigg Boss 4 Telugu: Nagarjuna Fires On Housemates Over Nominations - Sakshi

గ‌త కొద్ది రోజులుగా బిగ్‌బాస్ షో చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు ఓ సందేహం త‌లెత్తుతోంది. 'ముక్కూ మొహం తెలీని కంటెస్టెంట్ల‌ను తీసుకొచ్చారు. స‌రే, కానీ వాళ్లేంటి ఏదో పిక్నిక్‌కు వ‌చ్చిన‌ట్లు ఆడుకుంటున్నారు. ఫిజిక‌ల్ టాస్క్ వంటివి ఇంకా ఎప్పుడు మొద‌లెడతారు?" అని ప్ర‌శ్నిస్తున్నారు. నిజంగానే ఇంట్లో ఉన్న వాళ్లు అంద‌రిద‌గ్గ‌రా మంచి మార్కులు కొట్టేయ‌డానికే ప్ర‌య‌త్నిస్తున్నారే త‌ప్ప ఏ ఒక్క‌రూ గేమ్‌ను సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. దీంతో అంద‌రికీ ఓ రౌండ్ కౌటింగ్ వేయ‌డానికి కింగ్ నాగార్జున సిద్ధ‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. (బాంచెన్‌.. నా వ‌ల్ల అయిత‌లే: ఏడ్చేసిన‌ గంగవ్వ)

ప‌డ‌వ ప్ర‌యాణంలో కూడా నేను దిగిపోతానంటే నేను దిగిపోతానంటూ ‌నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను లైట్ తీసుకున్నారు. ఆడుతూ పాడుతూ ఒక్కొక్క‌రు త‌మంత‌ట తాముగా నామినేష‌న్‌లోకి వ‌చ్చారు. ఇలా నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను తేలిక‌గా తీసుకోవ‌డంపై మండిప‌డ్డారు. ఈమేర‌కు తాజాగా రిలీజైన ప్రోమోలో ఎందుకు నామినేష‌న్‌లోకి రావాల‌నుకున్నారు అని నాగ్ హౌస్‌మేట్స్‌ను సూటిగా ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధానం చెప్ప‌‌లేక ఇంటి స‌భ్యులు తెల్ల‌మొహాలు వేసుకుని నేల‌చూపులు చూశారు. బిగ్‌బాస్ నామినేష‌న్స్‌ను సీరియ‌స్‌గా తీసుకోమ‌ని చెప్పిన త‌ర్వాత కూడా ప‌డ‌వ‌లో ఆడుతూ పాడుతూ ఉండ‌టాన్ని త‌ప్పుప‌ట్టారు. నీ ఆట నువ్వాడుకో  అంటూ నోయ‌ల్‌ పైన ఫైర్ అయ్యారు. (నిద్ర‌లేచిన బిగ్‌బాస్‌: క‌ంటెస్టెంట్ల క‌ళ్లు తెరిపిస్తాడా?)

ఏంటి? సేఫ్ ఆడ‌దామ‌నుకుంటున్నారా? అని ప్ర‌శ్నిస్తూనే అది జ‌ర‌గ‌నివ్వ‌న‌ని నాగ్‌ తేల్చి చెప్పారు. మ‌రో ప్రోమోలో జీరో అనుకున్న‌వాళ్ల‌ను పంపిచేయండని నాగ్ సూచించ‌గానే అమ్మ రాజ‌శేఖ‌ర్.. దేవి చేయి ప‌ట్టుకుని న‌డిచాడు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన దేవి కామెడీ చేసిన‌వాళ్లే హీరోనా అని నాగ్‌ను తిరిగి ప్ర‌శ్నించింది. అటు లాస్య కూడా శ్రుతి మించిన కామెడీ అని మాస్ట‌ర్‌పై మండిప‌డింది. దీంతో మాస్ట‌ర్ తాను వెళ్లిపోతాన‌ని కోరాడు. ప్లీజ్ అంటూ చేతులెత్తి మొక్కుతూ మోకాలిపై మోక‌రిల్లి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. మాస్ట‌ర్ క‌న్నీరు మున్నీరు కావ‌డంతో ఇంటి స‌భ్యులు అత‌డిని ఓదార్చారు. గంగ‌వ్వ మాస్ట‌ర్ ఉండాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. ద‌గ్గ‌ర‌కు తీసుకుని అత‌డి క‌న్నీళ్లు తుడిచింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top