ఎంటర్టైన్ చేస్తానంటున్న కుమార్ సాయి

పేరు: కుమార్ సాయి పంపన
వృత్తి: నటుడు, కమెడియన్, దర్శకుడు
స్వస్థలం: కొట్టారక్కర, కేరళ
విద్య: గ్రాడ్యుయేషన్
పుట్టిన తేదీ: 18 ఫిబ్రవరి 1990
మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాయికుమార్ పంపనకు నటుడు అవ్వాలనేది చిన్ననాటి కోరిక. పెద్దయ్యాక ఆ కల నెరవేరింది. లక్కీ(2012) సినిమాతో వెండితెరపై ప్రవేశించినప్పటికీ, "ఈ రోజుల్లో" చిత్రంతో గుర్తింపు సాధించుకున్నాడు. బస్టాప్, లవ్ టచ్, నా సామిరంగ, ఆడు మగాడ్రా బుజ్జి, ప్రెజెంట్ లవ్ వంటి పలు చిత్రాల్లో నటించాడు. కానీ, కెరీర్లో పెద్ద బ్రేక్ అయితే రాలేదు.
దీంతో ఈ మధ్య సినిమాల్లో కనిపించకుండా పోయిన అతడు బిగ్‌బాస్ రియాలిటీ షోతో మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఈ సారి నటుడిగా కాకుండా దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకోవాలనుకుంటున్నాడు. అది కూడా తన అభిమాన హీరో నాగార్జునకు కథ చెప్పి ఒప్పించాలని పట్టుదలతో ఉన్నాడు. కాగా బిగ్‌బాస్ తొలి వారం ఎలిమినేషన్ పూర్తైన రోజే మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అందర్ని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తానని ధీమాగా చెప్పుకొస్తున్నాడు. మరి బిగ్‌బాస్ అతని కెరీర్‌కు ప్లస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి