బిగ్‌బాస్‌: డేంజ‌ర్ జోన్‌లో ఆ ముగ్గురు

Bigg Boss 4 Telugu: These Contestants Are In Danger Zone - Sakshi

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్ రెండో వారం ముగింపుకు వ‌చ్చింది. ఇప్పుడు మ‌రో కంటెస్టెంటును ఇంటికి సాగ‌నంపే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇప్ప‌టికే సూర్య‌కిర‌ణ్ హౌస్‌కు గుడ్‌బై చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే అత‌డి ఎలిమినేష‌న్‌ను అందరూ ముందుగానే ఊహిస్తూ వచ్చారు. కానీ రెండో వారానికి వ‌చ్చేస‌రికి మాత్రం ఎవ‌రు వెళ్లిపోతార‌నేది ఉత్కంఠ‌గా మారింది. పైగా ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ కూడా ఉండొచ్చ‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే ఈ వారానికి గానూ అభిజిత్‌, గంగ‌వ్వ‌, నోయ‌ల్‌, హారిక‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, సోహైల్‌, క‌ళ్యాణి, కుమార్ సాయి, మోనాల్ ఇలా తొమ్మిది మంది ఇంటి స‌భ్యులు నామినేట్ అయ్యారు.

మంచిగ‌నే ఉన్న: గ‌ంగ‌వ్వ‌
వీరిలో గంగ‌వ్వకు అంద‌రిక‌న్నా ఎక్కువ అభిమానులు ఉండ‌టంతో ఆమె బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. కానీ ఈ మ‌ధ్య ఆమె ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో బిగ్‌బాస్ బ‌య‌ట‌కు పంపిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఇప్పుడప్పుడే అలాంటి నిర్ణ‌యం తీసుకునేట‌ట్లు క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు ఆమె ఆరోగ్యంపై స్పందించిన గంగ‌వ్వ టీం ఆమె మంచిగ‌నే ఉంద‌ని, టెన్ష‌న్ ప‌డకుర్రి అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ వారం గంగ‌వ్వ బ‌య‌ట‌కు రాద‌ని తేలిపోయింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అనారోగ్యంతో ఏడ్చేసిన గంగవ్వ)

నోయ‌ల్ సేఫ్‌
అన‌వ‌స‌ర‌మైన వాటి కోసం అతిగా స్పందించ‌డం, ఇత‌రుల అభిప్రాయాల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ నోయ‌ల్ కొంత చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకున్నాడు. కానీ ఈ మ‌ధ్య అలాంటి విష‌యాల్లో త‌ల‌దూర్చ‌డం త‌గ్గించేసుకున్నాడు. త‌న ప‌నేదో తాను చేసుకుంటూ ఉన్న అభిమానుల‌ను కాపాడుకుంటున్నాడు. దీంతో నోయ‌ల్ కూడా సేఫ్ జోన్‌లో ఉన్నాడు. అభిజిత్‌, సోహైల్‌, మోనాల్‌, హారిక కూడా ఈ వారం గండం గ‌ట్టెక్కిన‌ట్లు తెలుస్తోంది. వీరి త‌ర్వాత స్థానంలో త‌క్కువ ఓట్లు సంపాదించుకున్న‌ అమ్మ రాజ‌శేఖ‌ర్ ఉన్నాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ నాకు సారీ చెప్పాలి: నోయ‌ల్)

డేంజ‌ర్ జోన్‌లో క‌ళ్యాణి
ఇక‌ మొద‌ట్లో పెద్ద గొంతేసుకుని, క‌య్యానికి కాలు దువ్విన‌ క‌ళ్యాణి త‌ర్వాత సైలెంట్ అయిపోయింది. అయినప్ప‌టికీ ఆమె డేంజ‌ర్ జోన్‌లో ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్న‌ట్టుగా ఉంది. అత‌డికి కూడా త‌క్కువ ఓట్లే ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి క‌ళ్యాణి, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, కుమార్ సాయి డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు. అయితే క‌ళ్యాణి, అమ్మ రాజ‌శేఖ‌ర్‌లో ఎవ‌రు వెళ్లిపోయినా ఎంటర్‌టైన్‌మెంట్‌కు గండి ప‌డుతుంద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. దీంతో మాస్ట‌ర్‌కు హౌస్‌లో కొన‌సాగేందుకు ఛాన్సిచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. క‌ళ్యాణిని బ‌య‌ట‌క పంపించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. (చ‌ద‌వండి: గ‌త సీజ‌న్ల‌ను వెన‌క్కునెట్టిన బిగ్‌బాస్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top