బ్లాక్‌ పాంథర్‌ నటుడు కన్నుమూత

Black Panther Actor Chadwick Boseman Passes Away At 43 - Sakshi

బ్లాక్ పాంథర్ నటుడు చాడ్విక్ బోస్‌మాన్‌(43) కన్నుమూశారు. గత కొంతకాలంగా కోలన్‌(పెద్దపేగు) క్యాన్సర్‌తో పోరాడుతున్న బోస్‌మెన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అతని మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ‘నిజమైన పోరాట యోధుడు, చాడ్విక్ పట్టుదలతో మీరు ఎంతో ప్రేమించిన అనేక చిత్రాలను మీ ముందుకు తీసుకువచ్చాడు. చాడ్విన్‌ ఇంట్లోనే మరణించాడు" అని చాడ్విక్‌ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా చాడ్విక్‌ నాలుగేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ఈ నటుడు 2016 నుండి స్టేజ్ త్రీ ప్రేగు క్యాన్సర్‌ తో బాధపడుతున్నాడు. (సంచలన దర్శకుడి ఇంట విషాదం)

బోస్‌మాన్‌ దక్షిణ కరోలినాలోని అండర్సన్‌లో పుట్టి పెరిగాడు. 2013లో లెజండరీ బేస్ బాల్ ఆటగాడు జాకీ రాబిన్సన్ కథతో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘42’ తో సినిమాల్లో వచ్చాడు. 2016లో వచ్చిన కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్‌లో మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా కనిపించి అంనతరం బోస్‌మెన్‌​ అతని ఇంటి పేరుగా మారింది. ఆ తర్వాత 2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది. అతను అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్,ఎవెంజర్స్: ఎండ్‌గేమ్‌లోని మరో రెండు పాత్రలతో అభిమానులను అలరించాడు. ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డా 5 బ్లడ్స్‌లో చాడ్విక్‌ చివరి సారిగా కనిపించారు. బోస్మాన్ చివరి సారిగా ఆగస్టు 12న ట్వీట్‌ చేశాడు. డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ నామినీ కమలా హారిస్ నామినేషన్‌ను అభినందిస్తూ ఈ ట్వీట్‌ చేశాడు. (వివాదంలో ప్రముఖ కామెడీ షో)

చదవండి : గుండె పగిలింది : కమలా హారిస్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top