సత్యమేవ జయతే 2 పోస్టర్‌ రిలీజ్‌

John Abraham New Poster From Satyameva Jayate 2 - Sakshi

బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం తాజాగా నటించిన సత్యమేవ జయతే 2 పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 2020 అక్టోబర్‌ 2న విడుదల కానున్న ఈ చిత్రం కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఇందులో అబ్రహం చేతిలో నాగలి.. శరీరంపై ఉన్న గాయాల నుంచి రక్తం త్రివర్ణ పతాకంలో ని మూడు రంగుల్లో కారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్‌ అతడి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి ‘గంగా మాత ప్రవహించే భూమిలో.. రక్తం కూడా త్రివర్ణంలో ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశాడు.  (అది‌ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది: ప్రీతి జింటా)

ఈ చిత్రానికి మిలాప్‌ జావేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జాన్‌ అబ్రహం తరనపున  దివ్య ఖోస్లా కుమార్‌ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం అవినీతికి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాటం చుట్టూ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్‌ విడుదుల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. వచ్చే ఏడాది ఈద్‌ కానుకగా మే 12న విడుదల కానుంది. కాగా.. ఇది, 2018లో వచ్చిన సత్యమేవ జయతే సినిమాకు ఇది సీక్వెల్‌ కావడం విశేషం. (స్వయంగా లేఖ రాసుకున్న కరీనా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top