బోడకొండలో 'లవ్‌స్టోరీ' సందడి 

Love Story Movie Shooting At Bodakonda Waterfalls Near Manchala - Sakshi

సాక్షి, రంగారెడ్డి : చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ దర్శకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ సినిమా  సన్నివేశాలు బోడకొండ వాటర్‌ పాల్స్‌ వద్ద శనివారం చిత్రీకరించారు. వాటర్‌ ఫాల్స్‌లో నాగ చైతన్య – సాయి పల్లవీ ఆడుతున్నట్లు సన్నివేశాలను, అలాగే గుట్టల్లో వారు బైక్‌పై విహరిస్తున్నట్లు చిత్రీకరించారు. ఈ లవ్‌ స్టోరీ సినిమాలో ప్రాధానమైన  ప్రేమకు సంబంధించి సన్నివేశాలు ఇక్కడే తీశారు. ఈ సినిమా షూటింగ్‌తో  బోడకొండ– చెన్నారెడ్డి  గూడ మధ్య ఉన్న గుట్టలు జనసందడిగా మారాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.  

  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top