రేఖ టూ రియా.. చరిత్ర పునరావృతమవుతోందా?

Rekha to Rhea How Media Trial Turned Them to National Vamps - Sakshi

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకుని ఇప్పటికే మూడు నెలలవుతోంది. మొదట ఆత్మహత్యగా భావించినప్పటికి.. తరువాత కేసు అనేక మలుపులు తిరుగుతూ.. చివరకు మాదక ద్రవ్యాల కోణం వెలుగు చూడటంతో ఎన్‌సీబీ సుశాంత్‌ ప్రేమికురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఈ కేసును పలు అత్యున్నత దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. కానీ వాటి కంటే ఎక్కువగా మీడియా, సోషల్‌ మీడియా రియాను దారుణంగా వేధిస్తోందంటూ ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ సెటబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థల కన్నా ముందు మీడియానే రియాను దోషిగా తేల్చాయి. అసలిప్పటి వరకు సుశాంత్‌ ఎందుకు చనిపోయాడో తెలియలేదు. కానీ మీడియా ట్రయల్స్‌ మాత్రం ఆమెను దోషిగా నిలబెట్టాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌ తెగ వైరలవుతోంది. సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం ఇదే సంఘటన జరిగింది.. నటి రేఖ విషయంలో కూడా మీడియా ఇలానే ప్రవర్తించింది అంటూ సమినా షేక్‌ అనే ట్విట్టర్‌ యూజర్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం తెగ ట్రెండ్‌ అవుతోంది. (చదవండి: రకుల్‌ ప్రీత్‌.. సారా అలీఖాన్‌...)

వ్యాపారవేత్త ముఖేష్‌కి, రేఖకి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లైన ఏడు నెలలలోపే అనగా 1990, అక్టోబర్‌ 2న ముఖేష్‌ చనిపోయారు. భార్య దుపట్టాతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అతడు కూడా సుశాంత్‌ లానే చనిపోయే ముందు రోజు వరకు చాలా సంతోషంగా ఉన్నాడని అతడి సోదరుడు పోలీసులకు తెలిపాడు. ముఖేష్‌ కూడా డిప్రెషన్‌తో బాధపడేవాడు. ఆ విషయం పెళ్లైన తర్వాత రేఖకు తెలిసింది. ఈ విషయాల గురించి ఆమె రేఖ: అన్‌టోల్డ్‌ స్టోరిలో వివరించింది. ముఖేష్‌ డిప్రెషన్‌ సమస్య తనను ఎంతో బాధపెట్టిందని.. తమ బంధం మీద కూడా ప్రభావం చూపించిందని వెల్లడించింది. అప్పడప్పుడు ముఖేష్‌ చాలా విపరీతంగా ప్రవర్తించేవడు. దాంతో రేఖ ఆ బంధం నుంచి విడిపోవాలనుకుంది. దీనికి తోడు.. బిజినేస్‌లో నష్టాలు. దాంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖేష్‌ తరచుగా తమ దగ్గర సూసైడ్‌ చేసుకోవాలనిపిస్తుంది అని అనేవాడని అతడి స్నేహితులు తెలిపారు. అసలు ముఖేష్‌ ఎందుకు చనిపోయాడనే విషయం మాత్రం తెలియలేదు అంటూ ట్వీట్‌ చేసింది సమీన. (చదవండి: జైల్లో రియాకు కనీసం ఫ్యాన్‌, బెడ్‌ కూడా లేదా..)

కానీ మీడియా మాత్రం రేఖను మంత్రగత్తె అని పిలిచింది. ముఖేష తల్లి కూడా రేఖను దారుణంగా విమర్శించింది. నటులు అనుపమ్‌ ఖేర్‌, సుభాష్‌ ఘయ్‌ వంటి వారు విరుద్ధ ప్రకటనలు చేశారు. ఇప్పుడు రియా విషయంలో కూడా అలానే జరిగుతోంది. అసలు సుశాంత్‌ ఎందుకు చనిపోయాడో తెలియదు. కానీ మీడియా మాత్రం రియాను మంత్రగత్తె అంటుంది. ఆమెను, ఆమె కుటుంబాన్ని దారుణంగా వేధిస్తుంది. సుశాంత్‌ కేసులో రియానే దోషిగా నిర్థారించింది అంటూ సమీన సుదీర్ఘమైన పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్‌ అవుతోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top