రియాను బైకూల్లా జైలుకు తరలించిన పోలీసులు

Rhea Chakraborty Moved To Women Jail In Mumbai - Sakshi

ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు నేపథ్యంలో  డ్రగ్స్ ఆరోపణలపై అరెస్టయిన సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తిని బుధవారం ఉదయం పోలీసులు ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. డ్రగ్స్‌ కేసులో మూడు దశలుగా రియాను విచారించిన నార్కొటిక్స్‌ సెంట్రల్‌ బ్యూరో అధికారులు నిన్న(మంగళవారం) రియాను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీడియో కాన్పరెన్స్‌ ద్వారా విచారించిన మేజిస్ట్రేట్‌ రియాకు బెయిలును తిరస్కరించి 14 రోజుల పాటు రిమాండుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో మంగళవారం రాత్రంతా రియా ఎన్‌సీబీ కార్యాలయంలోనే గడపాల్సి వచ్చింది. అయితే రేపు రియా బెయిలు పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనుంది. ముంబైలో మహిళలకు ఉన్న ఏకైక జైలు బైకుల్లా జైలు. ఈ జైలులోనే కోరీగావ్‌-భీమాలోని షీనా బోరా హత్య కేసలో ప్రధాన నిందితులుగా అరెస్టు అయిన ఇంద్రాణి ముఖర్జీయా, కార్యకర్త సుధా భరద్వాజ్‌ సహా మరి కొందరు మహిళ ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. (చదవండి: రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?!)

(చదవండి: బాలీవుడ్ ప్రముఖు‌లు కూడా ఉన్నారు: రియా)

కాగా, ఈ కేసులో రియా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే  ఆరోపణలను ఎదుర్కొంటోంది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు సుశాంత్ మాజీ మేనేజర్‌ శామ్యూల్ మిరాండా, దీపేశ్ సావంత్ సహాయంతో డ్రగ్స్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన మూడు రోజుల విచారణలో రియా చక్రవర్తిని మాదకద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉందని, ఆమె సిండికేట్ సభ్యురాలుగా ఉన్నట్లు వెల్లడైంది. మూడవ దశ విచారణలో రియా డ్రగ్స్‌ దందాలో బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఉన్నారని 25 మంది పేర్లు, డ్రగ్స్‌ ఉపయోగించే పార్టీల జాబితాను ఎన్‌సీబీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌, శామ్యూల్‌ మిరాండా సహా సుశాంత్‌ వద్ద పనిచేసిన మాజీ ఉద్యోగులను కూడా పోలీసలు ఆరెస్టు చేసి జైలుకు తరలించారు.  (చదవండి: రియా చక్రవర్తి అరెస్ట్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top