గాజులు ఘల్లుమన్నవే

Uppena Movie Poster Release - Sakshi

పంజా వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించాయి. సోమవారం కృతీ శెట్టి బర్త్‌డే సందర్భంగా ‘క్యూటెస్ట్‌ అండ్‌ నేచురల్‌ యాక్ట్రెస్‌ కృతీ శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. చేతులకు గాజులు వేసుకుంటూ అపురూపంగా వాటిని చూసుకుంటోన్న ఆమె లుక్‌ ఆకట్టుకుంటోంది.

‘‘ఉప్పెన’ చిత్రంలో వైష్ణవ్‌ తేజ్, కృతి మధ్య కెమిస్ట్రీ ముచ్చటగా అనిపిస్తోంది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు సంగీతప్రియులను అలరిస్తూ టాక్‌ ఆఫ్‌ ద టౌ¯Œ గా మారాయి. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. సానుకూల పరిస్థితులు ఏర్పడి, థియేటర్లు తెరుచుకోగానే సినిమాని విడుదల చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం’’ అని నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్‌ సైనుద్దీ¯Œ , ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అనిల్‌ వై, అశోక్‌ బి, సీఈవో: చెర్రీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top