సీపీఐ(ఎం) సీనియర్ నేత తంగవేలు మృతి

CPM Leader K Thangavelu Dies Of COVID-19 At 68 In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై :  కార్మిక హ‌క్కుల‌కోసం పోరాడిన  సీపీఐ(ఎం) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కె తంగవేలు(69) క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. గ‌త‌14 రోజులుగా  ఓప్రైవేటు ఆసుప‌త్రిలో  చికిత్స పొందుతున్న ఆయ‌న ఆదివారం తుదిశ్వాస విడిచారు. తంగ‌వేలుకు భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తగా సుమారు 25 సంవ‌త్స‌రాలుగా సేవ‌లందించిన ఆయ‌న కార్మిక‌హ‌క్కుల కోసం అనేక‌ప పోరాటాలు చేశారు. బనియన్ మిల్లు కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన తంగ‌వేలు వివిధ కార్మిక సంఘాల‌లో ప‌నిచేశారు.

నిజ‌యితీ గ‌ల నాయకుడిగా తంగ‌వేలుకు పార్టీలోనూ ప్ర‌జ‌ల్లోనూ మంచి పేరుంది. 2011-16 సంవ‌త్స‌రంలో తిరుపూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు.  ప్రస్తుతం  సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తంగవేలు  మరణం పట్ల పలువురు నేత‌లు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయ‌న‌కు మూడు రోజులపాటు సంతాప‌దినాలు నిర్వ‌హించాల‌ని సీపీఐ(ఎం) నిర్ణ‌యించింది. గౌర‌వ  చిహ్నంగా పార్టీ జెండాను మూడు రోజులపాటు అవ‌త‌నం చేస్తామ‌ని నేత‌లు తెలిపారు. (రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top