ఢిల్లీలో కొత్తగా 3,816 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 53 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 3,816 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 37 మది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 2,53,075 మంది కరోనా బారిన పడగా, మొత్తం 5,051 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం 3,097 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,16,401కు చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 31,623 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 26,37,753 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. (కరోనా: పెరుగుతున్న విటమిన్ల వాడకం)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి