దేశంలో కొత్తగా 86,961 కేసులు నమోదు

India Covid Update 86961 New Cases Recorded - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 54 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 86,961 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,130 మంది  మృతి చెందారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 93,356 మంది డిశ్చార్జ్ అయ్యారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు సోమవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 54,87,581గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 10,03,299గా ఉండగా.. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 43,96,399కి చేరింది. కోవిడ్‌ వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 87,882కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 79.68 శాతంగా ఉండగా.. యాక్టీవ్‌ కేసుల సంఖ్య 18.72 శాతంగా ఉంది. ఇక మరణాల రేటు 1.61 శాతానికి తగ్గింది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 7,31,534 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపగా.. ఇప్పటి వరకు మొత్తం 6,43,92,594 కోవిడ్‌ పరీక్షలు చేశారు. (చదవండి: చలికాలంలో చుక్కలే..!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top