క్ష‌మాప‌ణ చెప్పి శాశ్వ‌తంగా వెళ్లిపోతా : కంగ‌నా

Sena Slams BJPs Silence On Kanganas Terrorist  Remark - Sakshi

సాక్షి, ముంబై :  పైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్‌పై శివ‌సేన చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఆమె తీవ్రంగా స్పందించింది. తాను రైతుల‌ను ఉగ్ర‌వాదులు అని సంబోధించ‌లేద‌ని, ఒక‌వేళ అలా అనుంటే నిరూపించాల‌ని డిమాండ్ చేసింది. త‌న‌పై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌ని, ఇలాంటి ఆరోప‌ణ‌లు నిరూపిచంగ‌లిగితే త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ‌లు చెప్పి శాశ్వ‌తంగా ట్విట్ట‌ర్ నుంచి వైదొలుగుతానంటూ పేర్కొంది. అంతేకాకుండా  శ్రీకృష్ణుడికి నారాయణి సైన్యం ఉన్నట్లే, పప్పుకు తన చంపు సైన్యం ఉంటుందంటూ శివ‌సేన గురించి విమ‌ర్శ‌నాస్ర్తాలు సంధించింది. పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రాజ్యసభ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ బిల్లులు రైతులు సాధికారికత సాధించేలా తోడ్పడతాయంటూ మోదీ చేసిన ట్వీట్‌కు స్పందన‌గా ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ చేసిన ట్వీట్  రాజ‌కీయాల్లో హోట్ టాపిక్‌గా మారింది. (రైతులకు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ)

ఈ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ కొంద‌రు నిర‌స‌న‌కారులు సీఏఏ త‌ర‌హాలోనే ఉగ్ర‌వాదుల వ‌లె  రక్త‌పాతం సృష్టిస్తారంటూ కంగనా చేసిన ట్వీట్‌ను శివ‌సేన త‌న‌కు అనుకూలంగా మ‌ర‌ల్చుకుంది. వారి హ‌క్కుల‌కోసం పోరాడుతున్న రైతుల‌ను కంగ‌నా  ఉగ్ర‌వాదులు అని సంబోధించడం ఏంట‌ని ప్ర‌శ్నించింది. శివ‌సేన త‌న సంపాదకీయం సామ్నాలో కంగ‌నాపై విరుచుకుప‌డింది. గ‌తంలో ఓ న‌టి మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడితే చాలు రాజ‌కీయ పార్టీలన్నీ పాముల్లా త‌మ‌పై విషం చిమ్మారు..మ‌రి ఇప్పుడేమైంది?  రైతుల‌ను ఉగ్ర‌వాదులుగా, ముంబైని పాకిస్తాన్‌తో పోల్చి మాట్లాడినా బీజేపీ ఎందుకు మౌనం వ‌హిస్తోందంటూ ఆరోపించింది. మోదీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన బిల్లులను పంజాబ్, హ‌ర్యానా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రైతులు స‌హా ప‌లువురు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ని, కేంద్రం తెచ్చిన బిల్లులు నిర‌స‌న‌ల‌కు దారితీశాయ‌ని సంపాదకియంలో పేర్కొంది. (డ్రగ్స్‌ వాడకం ఫలితమే డిప్రెషన్‌: కంగనా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top