స్మృతి ఇరానీ పోస్ట్‌.. మేము ఎదురుచూస్తూ ఉంటాం!

Smriti Irani New Post Says She Is Currently Under Construction - Sakshi

న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఆమె పోస్టు చేసే మీమ్స్‌, జోక్స్‌, జీవిత విషయాలకు సంబంధించివి నెటిజన్లను ఎంతోగానే ఆకర్షిస్తాయి. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్టు పెట్టారు స్మృతి. మనల్ని మనం ఎల్లప్పుడూ ఎలా మెరుగుపరుచుకుంటాం, ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాం అనే విషయాన్ని ఈ పోస్టు ద్వారా వెల్లడించారు. (ఖాళీ కుక్కర్‌ను గ్యాస్ స్టౌ‌పై పెట్టింది ఎవరు?)

ఈ మేరకు.. ‘నేను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాను. మీ ఓపికకు ధన్యవాదాలు ’ అని పేర్కొన్నారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్‌ అయ్యింది.  22 వేల మంది లైక్‌ చేయగా ఈ  పోస్టుపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖుర్రానా సైతం దీనిని లైక్‌​ చేశారు. ‘మేడమ్‌ ఎంత సమయమైనా తీసుకోండి. మీ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం’. అని కామెంట్‌ చేశారు. మరొకరు.. ‘మీరు ఖచ్చితంగా దేశం కోసం ఉత్తమమైనది నిర్మిస్తారు’. అని పేర్కొన్నారు. (‘కర్మకు సరైన నిర్వచనం ఇదే’)

🤫

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top