కట్టని ఇళ్లను కూడా కట్టినట్టు చూపించారు: భట్టి

సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం బోగస్ లెక్కలు చెబుతోందని సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అనేక ప్రాంతాల్లో కట్టని ఇళ్లను కూడా కట్టినట్టు జాబితాల్లో తప్పుడు లెక్కలు చూపుతుందని పేర్కొన్నారు. నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో తప్పుడు లెక్కల వివరాలను భట్టి మీడియాకు వివరించారు. ప్రభుత్వ మోసాలను భట్టితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రత్యక్షంగా మీడియాకు చూపించారు. గ్రేటర్ హైదరాబాద్లోని 24 నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గానికి 10 వేల చోప్పున 2 లక్షల 40 వేల ఇళ్లు కడతామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని భట్టి తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి