‘ఒక్క స్టే ఎత్తివేసినా.. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం’

Nandigam Suresh: If One Court Stay Is Lifted Chandrababu Will Go To Jail - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబుది కోర్టు స్టే బతుకని బాపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగాం సురేష్‌ విమర్శించారు. చంద్రబాబుపై ఉన్న 26 కేసుల్లో ఒక కేసులో స్టే ఎత్తివేసిన చాలు ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు, ఆయన అనుచరులు, తెలుగుదేశం నాయకులు వేలాది ఎకరాల్లో దోచుకున్నారని మండిపడ్డారు. నిన్నటి వరకు ఏ విచారణకైనా సిత్ధమని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు సిట్ విచారణకు ఎందుకు అడ్డుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. (‘పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు’)

రాజధాని భూ కుంభకోణం వ్యవహారంలో వరుస అరెస్టులతో చంద్రబాబుతో పాటు తెలుగుదేశం నాయకులకు వెన్నులో వణుకు పుడుతోందని ఎంపీ దుయ్యాబట్టారు. అందుకే చంద్రబాబు తమ పార్టీ నాయకులతో సిట్ ఏర్పాటుపై కోర్టులో పిటిషన్ వేయించారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే సిట్ విచారణ ఎదుర్కోవాలని సవాల్‌ విసిరారు. సిట్ విచారణ అడ్డుకుంటున్నారు అంటే బాబు నిజంగా భూ దోపిడీకి పాల్పడినట్లేనని పేర్కొన్నారు. రాజధాని పేరుతో భూములు దోచుకు పోతే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని, రాజధాని పేరుతో భూముల దోచుకున్న వాళ్ళు ఎవరైనా సరే జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.పూర్తిస్థాయిలో సిట్ విచారణ చేస్తే బాబుతో సహా భూ దోపిడీకి పాల్పడిన తెలుగుదేశం నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. (‘రథాన్ని తగలబెట్టిన వారిని వదిలి పెట్టేది లేదు’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top