ధోనికి బంగారు టోపీ

Chennai Super Kings Honors MS Dhoni With Golden Cap - Sakshi

దుబాయ్‌: భారత క్రికెట్‌ బంగారం, చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయవంతమైన సారథి ధోనికి ఫ్రాంచైజీ బంగారు టోపీని బహూకరించింది. ‘తలా’గా చెన్నైని ఊపేస్తున్న ఈ ‘మిస్టర్‌ కూల్‌’ పదేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ పదేళ్లలో మూడుసార్లు (2010, 2011, 2018) టైటిల్‌తో చెన్నైని ‘సూపర్‌ కింగ్స్‌’గా నిలిపాడు. తమ జట్టును పదేళ్లు (మధ్యలో సీఎస్‌కేను రెండేళ్లు నిషేధించారు) నడిపించిన నాయకుడు ధోనికి ఫ్రాంచైజీ బంగారు టోపీతో పట్టం కట్టింది. ఫ్రాంచైజీ అంతర్గత అవార్డుల వేడుక అబుదాబిలో జరిగింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top