తన పిల్లల అల్లరి ఫోటోను పంచుకున్న వార్నర్‌

David Warner Posts Picture of His Daughters On Instagram - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు క్రికెట్‌లో ఎంత ఫాలోయింగ్‌ ఉందో, సోషల్‌ మీడియాలో కూడా అంతే ఫాలోయింగ్‌ ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో టిక్‌టాక్‌లో రకరకాల వీడియోస్‌తో ఫాన్స్‌ను అలరించాడు. తనతో పాటు తన ఫ్యామిలీ భార్య, పిల్లలు కూడా టిక్‌టాక్‌ వీడియోలు చేశారు. ఇప్పుడు తాజాగా తన పిల్లలు చేసిన అల్లరి ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఒక రోజు మీ పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేయండి. అప్పుడు మీ ఇంటిని వాళ్లు ఎలా చేస్తారో చూడండి అంటూ తన కూతుళ్ల ఫోటోను షేర్‌ చేశాడు. ఈ ఫోటోలోఆయన కూతుళ్లిద్దరూ పెద్దవాళ్ల డ్రస్సులు వేసుకొని ఉన్నారు.  ఈ ఫోటోకు ఆయన అభిమానులు చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు. దుబాయ్‌లో జరిగే ఐపీఎల్‌ 2020లో డేవిడ్‌ వార్నర్‌ ఆడనున్నాడు. దాని కంటే ముందు టీ-20, మూడు వన్డే సిరీస్‌లు ఆడనున్నాడు.    

చదవండి: సూపర్‌ హిట్‌ సాంగ్‌కు డాన్స్‌ చేసిన వార్నర్‌ కూతుళ్లు

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top