ఆరు కోట్ల ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌!

footballer Cristiano Ronaldo Rs 5.7 crore on engagement ring for Georgina Rodriguez - Sakshi

టాప్‌ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో త్వరలోనే ‘అధికారికంగా’ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న జార్జినా రోడ్రిగ్స్‌తో ఇటీవలే అతని ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే విశేషం అది కాదు. తన ఎంగేజ్‌మెంట్ సందర్భంగా ఆమెకు 6 లక్షల 15 వేల పౌండ్లు (సుమారు. 5.8 కోట్లు) తొడిగినట్లు సమాచారం. ఇలాంటి అంశాల గురించి ప్రకటించే ‘గ్యాంబ్లింగ్ డీల్స్‌’ అనే సంస్థ భారీ విలువ గల ఎంగేజ్‌మెంట్ రింగ్‌లు అందించిన ఫుట్‌బాలర్లతో ఏకంగా ఒక జాబితానే రూపొందించింది. ఇందులో అన్నింటికంటే రొనాల్డోనే టాప్ అని ఆ సంస్థ వెల్లడించింది. రొనాల్డోకు గతంలోనే ముగ్గురు పిల్లలు ఉండగా...జార్జినా ద్వారా 2017లో పాప పుట్టింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top