వచ్చే ఏడాదికి వాయిదా!

Thomas And Uber Cup May Postpone To Next Year - Sakshi

సందిగ్ధంలో థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌ టోర్నీ

కౌలాలంపూర్‌: ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ టోర్నీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కరోనా కారణంగా అగ్రశ్రేణి జట్లు తప్పుకోవడంతో టోర్నీ కళ తప్పుతోందంటూ స్పాన్సర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డెన్మార్క్‌లోని అర్హస్‌ వేదికగా అక్టోబర్‌ 3 నుంచి 11 వరకు జరగాల్సిన ఈ టోర్నీని వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ ముగిశాక టోక్యోలో నిర్వహిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. శనివారం వర్చువల్‌గా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య సమావేశంలో ఎక్కువ మంది వాయిదాకే మొగ్గుచూపినట్లు తెలిసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top