దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్లకు కరోనా

Three members of South African women test positive for COVID-19 - Sakshi

జొహాన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ బృందంలో ముగ్గురు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇందులో ఇద్దరు క్రికెటర్లు కాగా ఒకరు సహాయక సిబ్బంది ఉన్నారు. ఈ విషయాన్ని క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) శనివారం ప్రకటించింది. ఇంగ్లండ్‌ పర్యటన కోసం సోమవారం నుంచి మహిళల క్రికెట్‌ శిక్షణా శిబిరం జరగాల్సి ఉండగా... ప్రాక్టీస్‌ సెషన్‌ నుంచి ఈ ముగ్గురిని తప్పించినట్లు సీఎస్‌ఏ వెల్లడించింది. పాజిటివ్‌గా తేలిన ముగ్గురిలోనూ అతి స్వల్ప స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నాయని పేర్కొన్న సీఎస్‌ఏ రానున్న పది రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉంటారని పేర్కొంది. అనంతరం తమ వైద్య బృందం పరీక్షించాకే వారు ప్రాక్టీస్‌లో పాల్గొంటారని చెప్పింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ శిబిరానికి హాజరయ్యే క్రికెటర్ల బృందానికి 34 రకాల పరీక్షలు నిర్వహించినట్లు సీఎస్‌ఏ వెల్లడించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top