‘ధోని ఏమిటో మీరే చూస్తారు కదా’

You See Dhoni Helicopter Shots In UAE, Suresh Raina - Sakshi

ఇదొక చెత్త ఏడాది: రైనా

న్యూఢిల్లీ: దాదాపు ఐదు నెలల విరామం అనంతరం భారత క్రికెటర్లు మ్యాచ్‌లు ఆడటానికి సిద్ధమవుతున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటివరకూ ఇళ్లకే పరిమితమైన టీమిండియా క్రికెటర్లు.. వచ్చే నెలలో యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌లో ఆడటానికి సన్నద్ధమయ్యారు. కాంపిటేటివ్‌ క్రికెట్‌లో తమను నిరూపించుకోవడానికి ఇదే సమయం అని భావిస్తున్న వెటరన్‌ క్రికెటర్ల లిస్ట్‌లో ఎంఎస్‌ ధోనితో పాటు సురేశ్‌ రైనా కూడా ఉన్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోని.. ఐపీఎల్‌లో తన సత్తాచాటాలని భావిస్తున్నాడు. మళ్లీ భారత్‌ జట్టులోకి ధోని రీఎంట్రీ ఇచ్చేది.. లేనిది ఐపీఎల్‌తో డిసైడ్‌ అయిపోతుంది. ఆ కోవలోనే రైనా కూడా ఉ‍న్నాడు. ఎప్పుడో భారత క్రికెట్‌కు దూరమైన రైనా మాత్రం తన పునరాగమనం ఆశగా ఉన్నాడు. ('కెప్టెన్‌గా జట్టులో నాకే ప్రాధాన్యం తక్కువ')

కచ్చితంగా ఐపీఎల్‌లో నిరూపించుకుని మళ్లీ భారత సెలక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే ఆటగాడైన రైనా.. హిందూస్తాన్‌ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను షేర్‌ చేసుకున్నాడు. ప్రత్యేకంగా తనకెంతో ఇష్టమైన కెప్టెన్‌ అయిన ఎంఎస్‌ ధోనిని మరొకసారి పొగడ్తల్లో ముంచెత్తాడు. యూఏఈలో ధోని ఏమిటో మళ్లీ చూస్తారంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే తన మార్కు హెలికాప్టర్‌ షాట్లకు మరొకసారి సానబెట్టిన ధోని.. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో వాటితో మనల్ని మైమరిపిస్తాడన్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌కు గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో ఒక శుభపరిణామనని, అందుకోసం తామంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నాడు.

ఈ సీజన్‌ ఐపీఎల్‌ కోసం ఇప్పటికే తమ జట్టు(సీఎస్‌కే) ఎంతో హార్డ్‌ వర్క్‌ చేసిందని, ప‍్రతీ  ఒక్కరూ ఐపీఎల్‌ను ఎంజాయ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నాడు.  కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతూ.. ఇది ఎన్నో విషయాలను బోధించిందన్నాడు. అత్యంత చెత్త సంవత్సరాల్లో 2020 కూడా ఒక చెత్త ఏడాదిగా రైనా అభివర్ణించాడు. కరోనా వైరస్‌పై భారత్‌ చేస్తున్న పోరాటాన్ని ఇక్కడ అభినందిచాల్సిందేనన్నాడు. ఐపీఎల్‌ కోసం కుటుంబంతో యూఏఈకి వెళ్లడం అనేది బీసీసీఐ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా రైనా బదులిచ్చాడు.  ఇక స్టేడియాల్లో అభిమానులు లేకుండా మ్యాచ్‌లు ఆడటం అనేది చాలా కష్టమన్నాడు. ఈసారి ఐపీఎల్‌లో చెన్నై అభిమానుల్ని మిస్‌ అవుతున్నట్లు రైనా తెలిపాడు. (ఐర్లాండ్‌ సూపర్‌...)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top