టీమిండియా క్రికెటర్‌ చహల్‌ పెళ్లి ఆమెతోనే

Yuzvendra Chahal And Dhanashree Verma Officiate Their Relations With Roka - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్‌‌ యజువేంద్ర చహల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు,కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మను పెళ్లాడబోతున్నాడు. ఈ విషయాన్ని చహల్‌ స్వయంగా ప్రకటించాడు. గత కొంతకాలంగా ధనశ్రీతో చహల్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చని విషయం తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పెళ్లి ముహుర్తం ఖరారు చేసేందుకు శనివారం రోకా వేడుకను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ రోకా కార్యక్రమంలో ధనశ్రీతో కలిసిన ఉన్న ఫొటోను చహల్‌లు షేర్‌ చేస్తూ.. ‘అవును మేమీద్దరం పెళ్లి చేసుకోబుతున్నాం. ప్రస్తుతం మా కుటుంబాలతో కలిసి ‘రోకా’ కార్యక్రమంలో సందడి చేస్తున్నాం’ అంటూ టీమిండియా మణికట్టు స్పిన్నర్ చహల్‌‌ ట్వీట్‌ చేశాడు. ఈ ఫొటోలో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న చహల్‌, ధనశ్రీలను చూసిన నెటిజన్‌లు ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌‌ అదర్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చివరి సారిగా ఫిబ్రవరిలో జరిగిన ఓడిఎల్‌ సిరీస్‌లో కనిపించిన చహల్‌.. త్వరలో జరగబోయే ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూర్‌ తరపున బరిలోకి దిగుతున్నాడు. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌ జరగనున్న సంగతి తెలిసిందే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top