హైవేపై డ్రాగర్ చూపుతూ యువతి హల్చల్

హైవేపై డేంజరస్ వీలింగ్
సాక్షి, కర్ణాటక : బెంగళూరు గ్రామీణ జిల్లా పరిధిలోని దేవనహళ్లి మార్గంలోని హైదరాబాద్ హైవే, నెలమంగల సమీపంలోని తుమకూరు హైవేలపై వీకెండ్ వచ్చిందంటే యువతీ యువకులు వీలింగ్ చేస్తూ వాహనదారులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. శని, ఆదివారాల్లో తెల్లవారితే వీరి బెడద అంతా ఇంతా కాదు. వీరివల్ల అనేక ప్రమాదాలు సంభవించాయి. ఆదివారం రాత్రి నెలమంగల సమీపంలోని తుమకూరు హైవేపై ఒక జంట రెచ్చిపోయింది. (రాగిణి, సంజనలకు బెయిలు ఇస్తే ఇక అంతే)
యువకుడు బైక్ను వీలింగ్ చేసి రోడ్డుమీద న్యూసెన్స్ చేస్తుండగా వెనుక కూర్చున్న యువతి చేతిలో డ్రాగర్ పట్టుకుని ప్రదర్శిస్తూ వెర్రిగా కేకలు వేసింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు ఈ వీడియో తీసి వైరల్ చేశారు. ఈ జంట కోసం పోలీసులు వేట ప్రారంభించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి